Tuesday, 7 April 2020

కవిత నెం :338(మట్టి మనిషి)

"మట్టి మనిషి "
మట్టిలో పుట్టాం 
మట్టిలో ఆడుతూ పెరిగాం 
మట్టితో సహవాసం సాగిస్తున్నాం 
మనం తినే తిండి మట్టిలోనుంచే 
మనం కట్టే బట్ట మట్టిలోనుంచే 
ఆఖరికి మనల్ని కాల్చే కట్టే కూడా మట్టిలోనుంచే 
పల్లెలో పెరిగిన వారిని అడుగు మట్టిగురించి 
పల్లెలో తిరిగిన వారినడుగు మట్టితనం గురించి 
తొలకరిజల్లు పడే వేళలో అనుభవించు మట్టివాసనని 
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన కాయం ఆణువణువు కూడా మట్టి పదార్థమే 
పిడికెడు మన్నుతో అందమైన బొమ్మలు చెయ్యవచ్చు 
ఆ పిడికెడు మన్నుతో మన కాయాన్ని ఖననం చెయ్యవచ్చు 
ధనికుడైనా, పేదవాడైనా 
కమ్మరినైనా, కుమ్మరి అయినా 
క్షత్రియుడైనా, బ్రాహ్మణుడైనా 
అందరూ ఈ పసిడి లాంటి మట్టిలోనుంచి వచ్చిన వారు కాదా? 
నువ్వు సొంతంగా కొంప కట్టుకుని, సుఖంగా జీవించాలంటే ఈ పుడమి తల్లి ఆశీర్వాదం కాదా? 
నువ్వు నీరు పోసి నాటు వేసి వ్యవసాయం చేసి నువ్వు తిని నలుగురికి అందించాలన్న 
ఈ నేలతల్లి అందించే సిరిసంపదలు కాదా? 
ఎవ్వరు నీవు ఓ మనిషి? 
ఎటువైపు నీ పయనం ఓ మట్టి మనిషి? 
అంతా మిధ్యే అన్నట్టు అంతా మట్టే కాదంటావా? 
మధ్యలో వచ్చిన నీ సంపద, పేరు ప్రఖ్యాతలు 
శాశ్వతం అంటావా? 
నీతో పాటు వాటిని మోసుకెళ్తానంటావా? 
పుడమి తల్లి పొత్తిళ్లలో పెరిగిన నీవు 
ఏ పసిడిరంగులను చూసి ఆరాటం? 
వొట్టిమాటలు కట్టిపెట్టి 
నువ్వు మట్టిమనిషివని మరువకు ఓ మనిషి 

Related Posts:

  • 314(కన్నప్రేమ) కవిత నెం :314 *కన్నప్రేమ * కొడకా ఓ ముద్దు కొడకా కొడకా ఓ కన్న కొడకా కొడకా ఓ తల్లి కొడకా ఏందిరయ్యా నీ పొలికేక మారింది నీ నడక మా గతి ఏడ చెప్పలేక నువ్వ… Read More
  • గరిమెళ్ళ కవితలు నెం.1సంపుటిలోని కవితలు యొక్క క్రమం1. అమ్మ విలువ2. అజరామరం -నా తెలుగు3. సమయం లేదా మిత్రమా4. మేలుకో నవతేజమా5. ఆగకూడదు నీ గమనం6. జీవనమంత్రం7. పెనుమార్పు8. కోప… Read More
  • కవిత నెం :342 (ఒక స్వప్నం కోసం )*ఒక స్వప్నం కోసం *•••••••••••••••••••నిద్రించే నిన్ను మేల్కోలిపేదే స్వప్నంఅలజడితో మొదలై ఆశను పుట్టించి ఆశను మలుపుకున్నావో ఆశయమే నీదినీ స్వప్నం ని… Read More
  • 328(నా దేశం -ఒక సందేశం ) కవిత నెం :328 పేరు : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు  శీర్షిక : నా దేశం -ఒక సందేశం కవిత : 1 సంక్లిప్త చిరునామా : బీరంగూడ ,హైదరాబాద్  ఫోన్ .నెం… Read More
  • కవిత నెం 346(నా స్వప్నం (నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో  మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొ… Read More

0 comments:

Post a Comment