Thursday, 17 December 2020

గరిమెళ్ళ కవితలు నెం.1

సంపుటిలోని కవితలు యొక్క క్రమం

1. అమ్మ విలువ
2. అజరామరం -నా తెలుగు
3. సమయం లేదా మిత్రమా
4. మేలుకో నవతేజమా
5. ఆగకూడదు నీ గమనం
6. జీవనమంత్రం
7. పెనుమార్పు
8. కోపం ఒక శాపం
9. నిశీధిలో నేను
10. వెన్నెల్లో అమావాస్య
11. ఇదే జీవితం
12. మాతృత్వపు ధార
13. అంతర్యుద్ధం మనసుతో
14. పిచ్చిమాతల్లి
15. లోకంలో ఆడపిల్ల
16. కన్నీటి చుక్క
17. ప్రాస కనికట్టు
18. పేస్ బుక్ చిత్రాలు
19. తెలుగమ్మాయి
20. రక్షా బంధన్
21. బాల 'కర్మ 'కులు
22. ఆటోవాలా
23. తొలకరి జల్లు
24. మన పల్లెసీమ
25. దిక్సూచి
26. ఆకాశం
27. భూమిపుత్రుడు
28. ఓ సంద్రమా
29. అసహనం
30.నిద్రలోకం
31. వేశ్య ఎవరు?
32. మలినమైన మానవత్వం మధ్య
33. వెధవ జీవితం
34. నీ ఓటే ఒక ఆయుధం
35. ఆధిపత్య పోరు
36. నా దేశం -ఒక సందేశం
37. ఎదురుచూపుల సంక్రాంతి
38. జన్మ రహస్యం 

Thursday, 10 December 2020

కవిత నెం :342 (ఒక స్వప్నం కోసం )

*ఒక స్వప్నం కోసం *
•••••••••••••••••••
నిద్రించే నిన్ను మేల్కోలిపేదే స్వప్నం
అలజడితో మొదలై ఆశను పుట్టించి 
ఆశను మలుపుకున్నావో ఆశయమే నీది
నీ స్వప్నం నిజమవుతుంది
నీ స్వర్గం చేరువవుతుంది 

స్వేచ్ఛగా విహరించవోయి స్వాప్నికుడా 
గుండెలోపల దాగున్న భారాన్ని చేధిస్తూ
నిన్ను వెంటాడే బాధల్ని తరిమేస్తూ
నీ మనసుకు ఆనందపు రెక్కలు తొడుగుతూ
నీ స్వప్నాన్ని వారధిగా చేసుకుని 
రధసారధివై నీ గమ్యాన్ని మార్చుకో

పోగొట్టుకున్న చిన్ని చిన్ని సంతోషాలను
అడ్డుగోడగా మారిన అవరోధాలను
అనిశ్చితుణ్ణి చేసిన అవమానాలను
గరళంగా భ్రమించిన సందర్భాలను
నీ లక్ష్యంతో లక్షణంగా పలకరించు
ప్రతి స్వప్నపు మజిలీని దృశ్యంగా మార్చుకో
నీ విజయంతో వినమ్రంగా సమాధానపరుచు
గమనంతో నీ కలల సౌధాన్ని సాధించు 
నీ స్వప్నం తప్పక నిజమౌతుంది
నీ స్వర్గం తప్పక చేరువవుతుంది