Tuesday, 14 September 2021

నువ్వు యాదికొస్తే

నువ్వెక్కడున్నా ఓ వెన్నెలలా
నేను నీ వైపే చూస్తుండే నేలలా
తనివితీరని నీ రూపం 
అపురూపమై నా హృదిలో దాగుంది 
దప్పిక తీరని ప్రేమ దాహమేదో
నీ ప్రేమ ప్రవాహంలో మునిగియుంది
ఎప్పుడైనా నీవు యాదికొస్తే
నేనున్నానే నేను మరుస్తాను 
మరెప్పుడైనా నీ తలంపు వస్తే
నా ప్రాణమంతా కుబుసమై నీ తాన విడుస్తాను 
నీకు గుర్తున్నా ,నీకు గుర్తుకొస్తున్నా
అన్న ఊహే చాలురా బంగారం 
నీ కోసం,నీ ప్రేమ కోసం 
నిరీక్షించే నా మనసు 
తపిస్తూ నిన్నే తపించాలని 
నిన్నే మెప్పించాలని 
నీకోసం పదే పదే ఏదో ఆరాటం 
అదే నా జీవిత పోరాటం 

Related Posts:

  • కవిత నెం 230 :కన్నీరు కవిత నెం : 230 ''కన్నీరు '' కంటి నుండి వచ్చును 'కన్నీరు'  మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు  ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు ' ఉప్పెనగా మారితే అద… Read More
  • కవిత నెం 229 :ఎందుకే చెలీ! కవిత నెం :229 ఎందుకే చెలీ ఏమిటే హృదీ చేస్తుంది  అలజడీ ఉండదా మదీ నా జత కూడి తెలియని తొందరేదో పడి ఆగలేని ఆవేశమూ అర్ధమవ్వని ఆక్రోశమూ నీలో నువ్వే… Read More
  • కవిత నెం 226:దసరా సంబరం కవిత నెం :226 దసరా సంబరం  దసరా వచ్చిందండోయ్ - సరదా తెచ్చిందండోయ్  ''విజయ దశమి '' అను ఒక పేరుగా  ''దుర్గా నవమి ''అను  మరొక పే… Read More
  • కవిత నెం 228:ప్రేమను ఆపగలిగేది ఏది ? కవిత నెం  :228 *ప్రేమను ఆపగలిగేది ఏది ?* ఉదయించిన కిరణం   అస్తమానికి  చేరుకుంటుంది  పుష్పించిన కుసుమం వాలిపోయి ,వాడిపోవటానికి సిద… Read More
  • కవిత నెం 227 :మన హైదరాబాద్ (కవితా రూపంలో ) కవిత నెం : 227 ''మన హైదరాబాద్ '' (కవితా రూపంలో ) తెలంగాణా రాజధాని మన హైదరాబాద్  తెలుగు  ప్రజల గుండె చప్పుడు మన హైదరాబాద్  నవాబుల నాటి… Read More

0 comments:

Post a Comment