Wednesday, 13 May 2015

కవిత నెం150:హనుమాన్ జయంతి


కవిత నెం :150
హనుమాన్ జయంతి

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం. 
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు
ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం
ఎంతటి ఉపద్రవాల నుండైనా కాపాడే ఆపద్బాందవుడు 
కలలో కలవరించినా చాలు ,చింతను పోగొట్టే కరుణామూర్తి . 
అయన నామస్మరణ చాలు సర్వ దుఃఖ పరిహారం 
ఆయన మనసు మానవ సరోవరం 
ఆయన తేజస్సు హిమాలయం 
ఆయన రూపం భజే రుద్రరూపం 
ఆయన శౌర్యం ప్రభాదివ్యకావ్యం 
విజయాన్ని కలిగించే వీరాంజనేయుడు 
పిలిస్తే పలికే ప్రసన్నాంజనేయుడు 
అనంత శక్తి కలిగి యున్నవాడు ఆంజనేయుడు 
మరణాన్ని గెలిచిన సంజీవుడు ,చిరంజీవుడు 
నమ్మిన చాలు నీడలా తోడుండువాడు 

శ్రీరామునికి నమ్మిన బంటు ,మహా భక్తుడు 
నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. 
అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది. 

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది.

Related Posts:

  • కవిత నెం122: కవిత నెం :122 ముసురు కమ్మి చినుకునాపలేదు  గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు వెనుకడుగు వేసినా పులి పంజా వేట మానదు  నీటిప్రవాహం ఎంతవ… Read More
  • కవిత నెం120:సారీ సో సారీ అక్కా కవిత నెం :120 సారీ సో సారీ అక్కా  ఐ యామ్ రియల్లీ సారీ అక్కా  చిన్నవాడినే కదా నీముందు  చిన్న చూపు ఎందుకు ముందు ముందు  చేసిన … Read More
  • కవిత నెం 119:గెలుపు ఓటమిల నైజం కవిత నెం :119 *గెలుపు ఓటమిల నైజం * గెలిచే వారు ఆనంద విహారాలు చేస్తూ ఉంటారు గెలిచే వారు వేర్రివిలయతాండవం చేస్తూఉంటారు  గెలిచే వారు తమ భలప్రదర్… Read More
  • కవిత నెం118:చిలక పలికింది కవిత నెం :118 చిలక పలికింది చిన్నారి పుట్టిన రోజు అని  కోయిల కూసింది క్రొత్త కాశ్మీరం చూసింది  చంద్రుడు వేగంతో వస్తున్నాడు  తనకి … Read More
  • కవిత నెం 121:ఆడవారు కవిత నెం :121 //ఆడవారు// ఆడవారు అందంగా ఉంటారు. పొగరుగా ఉంటారు,వగరుగా ఉంటారు  స్వీట్ గా ఉంటారు ,హాట్ గా ఉంటారు. అమితానందం చూపుతారు కాసేపు&nb… Read More

0 comments:

Post a Comment