Thursday, 28 May 2015

కవిత నెం 157:మండే సూరీడు

కవిత నెం : 157

మండే సూరీడు 

భగభగమంటూ ,ఎర్రటినిప్పై మండుతూఉంటాడు 

సెగలనుకక్కుతూ,  ప్రపంచానికే వెలుతురునిస్తాడు 
ఉదయంలా వచ్చి , ఉషాకిరణమై మెరుస్తూఉంటాడు 
సమస్తలోకాలకు సారదై , సప్తఅశ్వాలపై స్వారీచేస్తాడు 
చీకటిని త్యజించి , అంధకారాన్ని పోగొట్టే ప్రభాకరుడు 
అందరికీ ఆరాధ్యదైవం , ప్రతి రోజూ వారితోనే గమనం 
గ్రహమండలాలకు అధిపతియై , సంచరిస్తుంటాడు 
బ్రతుకు నిచ్చేది  సూరీడు , భష్మం చేసేది సూరీడు 
ఆయన రూపం ''వృత్తాకారం '' , ఆయన తేజం ''ఉష్ణం ''
కరుణిస్తే కారుణ్యం చూపి ,ఆరుణోదయాన్ని చూపుతాడు 
ఆగ్రహిస్తే అగ్నిజ్వాలలు విసిరి ,అతలాకుతలం చేస్తాడు 
మన  స్వార్ధపు చర్యలతో ,సూర్యతాపానికి బలవుతున్నాం 
పచ్చదనాన్ని పెకిలించి ,ఉష్ణతీవ్రతను పెంచుకుంటున్నాం 
కాలుష్యాన్ని సృష్టించి , సూర్యునికి మండేలా చేస్తున్నాం 
వడగాలులు , వడదెబ్బలతో ,వడబడిపోతున్నాం 
భయంకరంగా ఉష్ణంతో ,రగిలిపోతున్నాడు సూరీడు 
ఆదర్శవంతుడైన ఆదిత్యుడు , దిశను తప్పుతున్నాడు 
ఎప్పటికీ చల్లారును తన మనస్సు చలించి ,శాంతించి 
మానవ తప్పిదములతో జరిగిన అపరాధమును మన్నించి 




Related Posts:

  • కవిత నెం :309( అక్షర సత్యాలు) కవిత నెం :309 అక్షర సత్యాలు పంతాలు -పైత్యాలు కోపాలు -తాపాలు పుణ్యాలు -పాపాలు అవి మనిషన్నవానికి మామూలు కష్టాలు -కన్నీళ్లు వస్తే తట్టుకోలేరు సుఖాలు… Read More
  • కవిత నెం :308 (పట్నపు సోయగం) కవిత నెం :308 * పట్నపు సోయగం * ఇరుకిరుకు నగరాలు వెనకెనుక బంగ్లాలు అగ్గిపెట్టె మేడలు మురికివాడల బ్రతుకులు ప్రతీ ఇంట మురుగు కంపులు కాలుష్యపు … Read More
  • కవిత నెం : 305(అత్యుత్సాహ అరంగేట్రం) కవిత నెం : 305 * అత్యుత్సాహ అరంగేట్రం * మీ గురించి మీరు ఆలోచించుకోండి పక్కనోడి శ్రద్ధతో ఆరోగ్యం పాడుచేసుకోకండి తరాలు మారినా మన తలరాతలు ఇంతేనా ప్రేమ… Read More
  • కవిత నెం :312(ప్రపంచ తెలుగు మహాసభలు) కవిత నెం :312 * ప్రపంచ తెలుగు మహాసభలు * అత్యంత రంగ వైభవంగా ప్రతీ ఇంట కవుల సంబురంగా తెలంగాణా తెలుగు వెలుగులు అంబరంగా అందరికీ ఉత్తర్వ / రిజిష్టర్ ఆహ్వ… Read More
  • కవిత నెం : 301// ప్రేమ యాన్ // కవిత నెం : 302 // ప్రేమ యాన్ // నీ వడి వడి పలుకులు నాలో జడి రేపేనే నా మడి గిడి అంతా సడి ఆయేనే నా మదిలో ఏదో అలజడిగా మెదిలి నా గుండెలో గుడిగా నీకై&nb… Read More

0 comments:

Post a Comment