Friday, 8 May 2015

కవిత నెం149:చరఖా

కవిత నెం :149

చరఖా

భారత స్వాతంత్రోద్యమంలో  మేటి రధసారధి
మువ్వన్నెల జెండాలో రూపుదిద్దబడిన తొలిచిహ్నం
చేనేత కళాకారులకు వారసత్వపు కల్పవృక్షం
స్వదేశీ వస్త్ర సంరక్షణకు  గాంధీ వాడిన ఆయుధం
విదేశీ వస్త్ర బహిష్కరణలో వినియోగించిన యంత్రం
ప్రాచీన వస్తు సంప్రదాయాలకు నిలువెత్తు రూపం
ఖద్దరు బట్టల రూపకల్పనకు మూలమైన రాట్నం
చేనేత సామాజిక వర్గానికి ఇది జీవనాధారం  
స్వయం సమృద్దికి ,సవాళ్ళను అధిగమించే  దైర్యంకి 
అనునిత్యం పనిచేస్తూ ఉండే చరఖానే ఒక స్పూర్తి 
బారతీయ సంస్కృతికి చరఖాతో అనుబంధం 
విడదీయలేని దేశాభిమాన ఆత్మీయబంధం 
కాలానుగమనంలో అదృశ్యమవుతున్న వైనం 
నేటి తరం వాళ్ళకు చరఖా అంటే తెలియనితనం 
చూసి నేర్చుకోవాల్సింది మన చరఖా నుంచి 
మన స్వదేశీ సరుకు లో దాగి ఉన్న ఖుషి 
దేశ కీర్తిని పెంచటంలో చరఖా యొక్క కృషి
మరువకండి ,మరువనీయకండి 
స్వదేశాన్ని ప్రేమించండి - స్వాభిమానాన్ని కాపాడండి 





Related Posts:

  • తొలకరి జల్లు(20) కవిత నెం :20 *తొలకరి జల్లు * ఆకాశం ఆనందించి నాపై కురిపించెనే మంచు ముత్యాలువాన నా మనసు పరవశించి ఆ చిరుజల్లుల పుప్పొడులను నాలో దాచుకోనా నింగిసైతం నా చె… Read More
  • మల్లె పువ్వు (21) కవిత నెం :20 ***** మల్లె పువ్వు ***** ఇది మనసును దోచే పువ్వు  ఇది మనసుకు హత్తుకునే పువ్వు  ఇది మన ఊసుల్ని కదిలించే పువ్వు  ఇది హృదయమ… Read More
  • ఓ మధూ (6) ఓ మధూ (6) ఓ మధూ నా మధూ 'మధు' ర మైన నీ నవ్వు  అదే నాకు 'మధు' రామృతము  'మధు'వులను కురిపించే నీ కనులు  నా రూపమును చూపించే దృశ్య బింబమ… Read More
  • కవిత నెం : 22 //కర్ణుడు // కవిత నెం : 22 //కర్ణుడు // భాస్కరుని తేజంతో జన్మించిన కుంతీ వరపుత్రుడు పుట్టుకతోనే సహజ కవచకుండలములు దరియించినవాడు అర్జునుడితో సమానంగా సకలవిద్యల… Read More
  • manogna(4) కవిత నెం : 4 … Read More

0 comments:

Post a Comment