Saturday, 20 June 2015

కవిత నెం 158:నాన్న నువ్వంటే ఇష్టం

కవిత నెం :155
నాన్న నువ్వంటే ఇష్టం 

నువ్వంటే ఇష్టం నాన్న 
నీ రూపం నా  ఊహలకు మాత్రమే పరిమితమైనా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నీ వేలుపట్టి నడకనేర్చింది గుర్తులేకపోయినా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నీ భుజాలపై , ఆడుకున్నది జ్ఞాపకాలకే సొంతంఅయినా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నన్ను నీ గుండెకు హత్తుకున్న స్పర్శ నాకు దూరంఅయినా 

నాన్నంటే .... తన మనసు వెన్న అని 
నాన్నంటే .... నిలువెత్తు రూపం అని 
వింటుంటే నా చెంత నువ్వెందుకు లేవనిపిస్తుంది నాన్న 

పుట్టింది అమ్మ కడుపులో నుంచైనా 
నా జన్మ నీ రక్త సంబంధమే కదా నాన్న 

పసితనంలో నేను నిన్ను నాన్న అని పిలిచానో లేదో కూడా తెలియదు 
నేను నీలా ఉన్నానని 
నేను నే రూపంలా పెరిగానని 
నిన్ను చూసిన వాళ్ళు నన్ను చూసి 
నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంటే ఆనందపడ్డాను 
నాకు నువ్వు ఇచ్చిన ఈ గుణమే ... ఓ మూల ధనము 
నాకు నువ్వు పంచిన అక్షరం .... సంస్కారం 
కాలంతో పాటు నువ్వు వెళ్ళావో .... 
ఏకాంతంలో నన్ను విడిచి వెళ్ళాలో తెలియదు నాన్న 
ఎందరు నా చెంత ఉన్నా , 
నాకు కావలసింది నాకు దొరికినా 
ఏదో తెలియని లోటు ఎద మాటున మౌనంలా మెదులుతున్నా 
నాన్న నువ్వంటే నాకు ఇష్టమే 
ఈ జన్మ ఒక అదృష్టమే నాన్న నువ్వు నాకు నాన్న వైనందుకు 



Related Posts:

  • శ్రీ హరి గోవిందం (351)ఎంతెంతో పుణ్యం హరి నామస్మరణంపిలిచినా పలికెను -అదియే శ్రీనివాస అభయంభక్తులను సదా కాచి కాపాడెను కోరిన కోర్కెలు తీర్చే వైకుంఠ నాధుడుఏడెడు లోకాలు దాటి… Read More
  • @@@@అడుగడుగునా అనుబంధాల మూటలుఆత్మీయత , అభిమానాల గొడవలుకమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసనదూరమవుతున్న బందాల అన్వేషనదగ్గరగా ఉన్న , పరిచయాలే పక్కన… Read More
  • హోళీ (కవిత నెం 348)వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"రాధా కృషుల ప్రేమ గీత… Read More
  • నువ్వు యాదికొస్తేనువ్వెక్కడున్నా ఓ వెన్నెలలానేను నీ వైపే చూస్తుండే నేలలాతనివితీరని నీ రూపం అపురూపమై నా హృదిలో దాగుంది దప్పిక తీరని ప్రేమ దాహమేదోనీ ప్రేమ ప్రవ… Read More
  • కవిత నెం271: ఇదే జీవితం ... !! కవిత నెం :271 శీర్షిక పేరు : ఇదే జీవితం ... !! ఏది సత్యం ఏది నిత్యం ఏది కృత్యం ఏది నృత్యం ఏది భావం ఏది జాలం ఏది రాగం ఏది త్యాగం ఏది పైత్యం ఏది ద… Read More

0 comments:

Post a Comment