Sunday, 28 June 2015

కవిత నెం159:వేశ్య ఎవరు ?

కవిత నెం :159

వేశ్య ఎవరు ?

ఏ  బ్రహ్మకలం నుండి జారిన పదం ఇది 
ఏ పరబ్రహ్మ సృష్టించిన జన్మ ఇది 
ఎవ్వరు ఈమెనిలా మార్చివేసినది 

ఏ దృతరాష్ట్రుని చేతినుండి పుట్టిన దౌర్భాగ్య స్థితి ఇది 
అవగాహన లేనితనం సాని గృహాలకు బలౌతుంది  
అవకాశమిచ్చిన కాలం ''వేశ్య '' బిరుదును బహుమతినిస్తుంది 

పిలువటానికి సిగ్గు పడే పేరు కదా అది 
తలవటానికే పనికిరాని బూతుపదం కదా అది 
మరి ఎంతో మంది విలాసాల వస్తువైనది 
కొన్ని తలరాతలు మార్చే సిరా అయినది 

కూటికోసం కోటి విద్యలే - మరి ఈ విద్య ఎలా అబ్బినది 
స్వేచ్చ ఉన్నా, పంజరంలో రాబందులకు ఆహారమేనా 
చీకటి బ్రతుకులలో అనాదిగా ఆరిపోయే దీపాలేనా  

ఆడదంటే ఆదిశక్తి స్వరూపమని మరచితిరా 
తరాలు మారినా ,స్త్రీ తలరాత బానిసత్వపు సంకెళ్లేనా  
అలవాటు ముసుగులోఅందులయ్యే  ఆడబిడ్డలు కొందరైతే 
నిస్సహాయపు కోరల్లో ,విష నాగులకు బలయ్యే హృదయాలు ఎన్నో 
ప్రోత్సాహకులు ,కామాందులు  ఉన్నంత కాలం ఈ పేరు మారదు 
ఆడవారిని గౌరవించి గుర్తించ నంత కాలం ఈ వ్యవస్థ మారదు 


Related Posts:

  • కవిత నెం 243 :బురదలోకి రాయి కవిత నెం : 243 బురదలోకి రాయి నువ్వేస్తేనోయి బురద చిందునోయీ నీ కంటునోయి గమ్మునుండవోయి దుష్టులకు భాయి జగడమాడకోయి అది నీకు కీడు భాయి అందరూ ఒకలా ఉండరోయి… Read More
  • కవిత నెం 245 :నా మది అలా - నా మాట ఇలా కవిత నెం : 245 *నా మది అలా - నా మాట ఇలా * గుండె గోదారిలా నువ్వు కావేరిలా మనసు మయూరిలా కదిలే భూగోళంలా నీ నవ్వు కోయిలా నీ నడక హంసలా నువ్వు కోవెలలా నే… Read More
  • కవిత నెం 241 : బంధాలు అనుబంధాలు కవిత నెం  : 241 బంధాలు అనుబంధాలు అంటే నాకిష్టం  కొత్తవారినైనా త్వరగా అల్లుకోగలనేమో  అల్లుకున్న బంధం మామిడి తోరణంలా   పచ్చగా… Read More
  • కవిత నెం 244 :నీలాంటోడు మరొకడు కవిత నెం  : 244 *నీలాంటోడు మరొకడు * సరదాగా చెప్పుకున్నా గొప్పగా చెప్పుకున్నా మనకు మనమే సాటి అని మనలాంటి వాడు ఉండడని మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మ… Read More
  • కవిత నెం 246 :నువ్వే నా చిరుజల్లు కవిత నెం : 246 * నువ్వే నా చిరుజల్లు * నువ్వు పలికితే - నా గుండె జల్లు నువ్వు నవ్వితే - ముత్యాల జల్లు నువ్వుంటే చాలు - నాకు చిరుజల్లు నీకోసమే ఉంది -… Read More

0 comments:

Post a Comment