Wednesday, 22 July 2015

కవిత నెం160:పొగ -సెగ

కవిత నెం : 160

పొగ -సెగ 

కంటికి కనపడే ఆవిరి లాంటి రెండక్షరాల రూపం
ప్రపంచాన్నే తన గుప్పిటపెట్టుకున్న వ్యసనదాహం
యువతరాన్నిఉర్రూతలూగించే ఒక మైకం
పొగలా చేరి సెగ రాజేసి తనపరం ఈ జనం
హానికరం అంటూనే ఆనందం చూడమంటుంది
ఒక్కసారి  అంటూ మళ్ళీ మళ్ళీ రుచి పొందమంటుంది
అలా అలా దినచర్యలో ఒక భాగం ఈ ధూమపానం
విషాన్నిచ్చే నికోటిన్ ఉన్నా నేనే కింగ్ అంటుంది
ఏదో బలమనుకుంటారో ,స్టైల్ అనుకుంటారో ఏమో
''బానిస '' లా మారుతూనే ''బాద్ షా '' అనుకుంటారు
పొగ పాగా అనేక రకాలుగా ఉంటూ స్వాగతమిస్తది
చుట్టా ,బీడీ ,సిగరెట్ ,హుక్కాలుగా హ్యాకింగ్ చేస్తది
పబ్ లంటూ హుక్కా పొగ మాయతో ఊగే జనం
మన అలవాటు మన జీవితాన్నే శాసిస్తుంటే
తెలిసి తెలిసి పొరపాటు మనమెందుకు చెయ్యాలి
పొగ త్రాగాకండి , పొగ త్రాగనీయకండి 
పొగత్రాగని వాడు వచ్చే జన్మలో దున్నపోతవును 
అని గోప్పపోతూ ఈ జన్మను నాశనం చేసుకోకండి 



Related Posts:

  • కవిత నెం : 301// ప్రేమ యాన్ // కవిత నెం : 302 // ప్రేమ యాన్ // నీ వడి వడి పలుకులు నాలో జడి రేపేనే నా మడి గిడి అంతా సడి ఆయేనే నా మదిలో ఏదో అలజడిగా మెదిలి నా గుండెలో గుడిగా నీకై&nb… Read More
  • కవిత నెం :300//భగ్న ప్రేమ // కవిత నెం :300 //భగ్న ప్రేమ // నిలుచున్నా నీ నీడల్లో నీకోసం నిలుచున్నా నీ తలపుల్లో నీ కోసం మబ్బులలో విహరిస్తున్నా నా జాబిలి కోసం నీరులా ప్రవహిస్తున… Read More
  • కవిత నెం :308 (పట్నపు సోయగం) కవిత నెం :308 * పట్నపు సోయగం * ఇరుకిరుకు నగరాలు వెనకెనుక బంగ్లాలు అగ్గిపెట్టె మేడలు మురికివాడల బ్రతుకులు ప్రతీ ఇంట మురుగు కంపులు కాలుష్యపు … Read More
  • కవిత నెం : 299 (జీవం -నిర్జీవం) కవిత నెం : 299 * జీవం -నిర్జీవం * ఒకవైపు ఆనందం ఆకాశం వైపు మరోవైపు విషాదం ఆందోళన వైపు కనులముందు కాంతులే వెదజల్లుతున్న అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసు… Read More
  • కవిత నెం : 305(అత్యుత్సాహ అరంగేట్రం) కవిత నెం : 305 * అత్యుత్సాహ అరంగేట్రం * మీ గురించి మీరు ఆలోచించుకోండి పక్కనోడి శ్రద్ధతో ఆరోగ్యం పాడుచేసుకోకండి తరాలు మారినా మన తలరాతలు ఇంతేనా ప్రేమ… Read More

0 comments:

Post a Comment