Tuesday, 11 August 2015

కవిత నెం161:ఎందుకిలా చేస్తావు

కవిత నెం :161
*ఎందుకిలా చేస్తావు * మబ్బువై  కప్పేస్తావు 
మనసు నిండా దాగుంటావు 
మల్లెవై మురిపిస్తావు 
ముద్దు ముద్దుగా గుర్తొస్తావు 
ఊసులెన్నో పలికిస్తావు 
ముచ్చట్లెన్నో చెప్పేస్తావు 
నిజమై నిన్ను చేరవస్తే 
సఖి ఎందుకిలా నిట్టూర్పై ఎదురొస్తావు 

కలలోకి వస్తావు 

ప్రేమ కధలెన్నో చెప్తావు 
కళ్ళు తెరవగానే 
వెక్కిరించి పోతావు 
నీ జాడ లేని ప్రపంచంలో 
ఒంటరిగా నన్ను మార్చావు 


0 comments:

Post a Comment