Tuesday, 18 August 2015

కవిత నెం 162:అందమా .... చంద్రబింభమా

కవిత నెం :162
అందమా .... చంద్రబింభమా
నన్ను నిద్దురపోనీయక చేసే రూపమా

ప్రాణమా ... నా ప్రతి రూపమా

నా  ఊపిరిని అందనీయకుండా చేసే పరువమా

కావ్యమా .... ఖజూరహో శిల్పమా

నీ ధ్యాసతో కుదురు లేకుండా చేసే పరిహాసమా

గంధమా ... సుగంధమా

నీ ఎద పరిమళాలతో మతిని పోగొట్టే  ప్రణయమా

మౌనమా ... మధుర భావమా

నీ జ్ఞాపకాలతో తిమ్మిరి పుట్టించే మౌనరాగమా

రమ్యమా .... లావణ్యమా

నన్నే పలకరిస్తూ ,నాకు ఎదురొచ్చే చిరు ధరహాసమా

ప్రియతమా ... నా హృదయమా 

నాకై తపిస్తూ ,నన్నే జపిస్తూ   నిరీక్షించే నా బంధమా 

                                                 - గరిమెళ్ళ గమనాలు//18. 08. 15//












Related Posts:

  • కవిత నెం 210 :ఒక్కడినే కవిత నెం :210 ఒక్కడినే  నాలో నేనే ఒక్కడినే  నాతో నేనే ఒక్కడినే  నా ముందు నేను  నా వెనుక నేను  నా చుట్టూ నేను  నేనంతా … Read More
  • కవిత నెం 202:రైలంట రైలు కవిత నెం : 202 రైలంట రైలు దీనికి ఉండదంట వేలా పాలు ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు కూస్తూ ఉంటుంది రైలు బెల్లు  ఆగిన చోట ఉండదు ప్రతీ చోటా ఇది ఆగదు కా… Read More
  • కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........ కవిత నెం :203 నిజమైన దీపావళి రావాలనీ ........  స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు  కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు  వ్యస… Read More
  • కవిత నెం 212:వీడ్కోలు 2015- స్వాగతం 2016 కవిత నెం :212 వీడ్కోలు 2015- స్వాగతం 2016 గతాన్ని విడనాడాలి కాని గత సృతులు కాదు కష్టాల్ని మరువాలి కాని కష్టపడటం కాదు చెడు నుంచి నేర్చుకోవాలి కాని చ… Read More
  • కవిత నెం 208:నేను కవినేనా ? కవిత నెం :208 నేను కవినేనా  నేను కవినేనా  మనసు పెట్టే రాస్తాను  నా కాలానికి పని చెబుతుంటాను  మరి నేను కవినేనా ? అక్షరాలను కలుప… Read More

0 comments:

Post a Comment