Friday, 28 August 2015

కవిత నెం164(రక్షా బంధన్)

కవిత నెం :164

రక్షా బంధన్ - రక్త సంబంధం 

అన్నా చెల్లెళ్లకి 
అక్కా తమ్ముళ్ళకి 
వారి మధ్య ఉన్న ప్రేమకి 

ఒకరంటే ఒకరికి 
వెంట నడిచే తోడుకి 
అనుబంధాల తీపి గుర్తుకి 

రాఖీ - రక్షా బంధన్ 
రాఖీ - ప్రతి ఇంటికీ ఒక బంధన్ 

అమ్మలోని ''అ '' పదం 
నాన్నలోని ''న్న '' పదం కలిపితేనే ''అన్న ''

అమ్మ తర్వాత అమ్మగా 
నాన్న లాగ బాధ్యతగా తోడుండేదే ''అక్క ''

అన్నైనా -తమ్ముడైనా 
నీకు అందివ్వగలిగేది ఆనందమే 

అక్కైనా -చెల్లెలైనా 
అపురూపమైన ఆప్యాయతల కొలువురా 

మర్చిపోయే బంధాలను కలిపేది రాఖీ 
మారిపోయే హృదయాలకు బంధం రాఖీ 
వత్సరానికి ఒక్కసారి వచ్చినా 
మీ కన్నులలో వసంత వెలుగులు నింపేది రాఖీ 

మీరిద్దరైనా - మీరెందరైనా 
పుట్టింది ఒక ప్రేగు బందానికే 

మమత మీది - రక్త సంబంధం మీది 
మీరెక్కడున్నా ఒకటిగా ఉండటానికే 

మీరు తిట్టుకున్నా - మీ ఇష్టం తగ్గిపోదు 
మీరు కొట్టుకున్నా - మీ ప్రేమలు మారిపోవు 

మీలో స్వార్ధాన్ని బందించటానికి కట్టు రాఖీ 
మీ ప్రేమలు రెట్టింపవ్వటానికి కట్టు రాఖీ 

మీ అవసరాలు మీ ఆలోచనల్ని మార్చవచ్చు 
మీ జీవన గమనంలో దూరం పెరుగవచ్చు 

యుగోలతో ,మొహమాటాలతో అంతర్యుద్ధం వద్దు 
నిజాయితీతో ,ప్రేమతో పలకరింపులే ముద్దు 

మారేది ప్రపంచం మాత్రమే , మీరు కాదు 
మీరు మారి , మీ కన్నవారి కళ్ళలో కన్నీళ్లు కావద్దు 

మనకోసమే పుట్టిందేమో ఈ రాఖీ 
ఇది అవసరం ముందు ముందు అందరికీ 
ఏడాదికి ఒక్కసారైనా తెరువు నీ మనసు కిటికీ 
                                                        - గరిమెళ్ళ గమనాలు //28. 08. 15//






Related Posts:

  • కవిత నెం 346(నా స్వప్నం (నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో  మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొ… Read More
  • కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి ) కవిత నెం :213 ఎదురుచూపుల సంక్రాంతి  ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని  ఎంతమంది అమ్మా ,న… Read More
  • గరిమెళ్ళ కవితలు నెం.1సంపుటిలోని కవితలు యొక్క క్రమం1. అమ్మ విలువ2. అజరామరం -నా తెలుగు3. సమయం లేదా మిత్రమా4. మేలుకో నవతేజమా5. ఆగకూడదు నీ గమనం6. జీవనమంత్రం7. పెనుమార్పు8. కోప… Read More
  • కవిత నెం 248 ( ఒక చిన్న మాట) కవిత నెం : 248 మాట మాట ఒక చిన్న మాట  మనసుని హత్తుకున్న మాట  మౌనంలోన దాగి ఉన్న మాట  గొంతు గ్రంథిలో తిరుగుతున్న మాట  గుప్పెడంత గు… Read More
  • కవిత నెం 201(అప్పుల తిప్పలు) కవిత నెం :201 'అప్పుల తిప్పలు '' అప్పుల తిప్పలు  ఇవి ఎవ్వరికే చెప్పుడు  ఆదియందు అందంగా  రాను రాను భారంగా  మన ఆలోచనలను ఘోరంగా&n… Read More

0 comments:

Post a Comment