Thursday, 17 March 2022

హోళీ (కవిత నెం 348)

వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"
సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"
చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"
రాధా కృషుల ప్రేమ గీతాల గాన విభావరి "హోళీ"
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక "హోళీ"
బాధల్ని మరచి , ఆనంద పరవశంలో ఆడే కేళి 
చిన్నా ,పెద్దా అంతా కలిసి సంబరాలతో చేసే సందడే ఈ "హోళీ"
అనురాగం , ఆప్యాయతలతో రంగులు చేసే స్నేహం "హోళీ"
కొత్త బంధాలకు, బాంధవ్యాలను జత చేసే పండుగ "హోళీ"
రాగ ద్వేషాలకు అతీతంగా ఇది రంగులు చేసే "హోళీ"
జగమంతా రంగులమయం
ప్రపంచంలోని రంగులన్నీ కలిసి చేసే కోలాహలం
అన్నీ రంగులు కలిస్తేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం

Related Posts:

  • కవిత నెం 201(అప్పుల తిప్పలు) కవిత నెం :201 'అప్పుల తిప్పలు '' అప్పుల తిప్పలు  ఇవి ఎవ్వరికే చెప్పుడు  ఆదియందు అందంగా  రాను రాను భారంగా  మన ఆలోచనలను ఘోరంగా&n… Read More
  • కవిత నెం 248 ( ఒక చిన్న మాట) కవిత నెం : 248 మాట మాట ఒక చిన్న మాట  మనసుని హత్తుకున్న మాట  మౌనంలోన దాగి ఉన్న మాట  గొంతు గ్రంథిలో తిరుగుతున్న మాట  గుప్పెడంత గు… Read More
  • గరిమెళ్ళ కవితలు నెం.1సంపుటిలోని కవితలు యొక్క క్రమం1. అమ్మ విలువ2. అజరామరం -నా తెలుగు3. సమయం లేదా మిత్రమా4. మేలుకో నవతేజమా5. ఆగకూడదు నీ గమనం6. జీవనమంత్రం7. పెనుమార్పు8. కోప… Read More
  • కవిత నెం 346(నా స్వప్నం (నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో  మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొ… Read More
  • కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి ) కవిత నెం :213 ఎదురుచూపుల సంక్రాంతి  ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని  ఎంతమంది అమ్మా ,న… Read More

0 comments:

Post a Comment