Saturday, 3 February 2024

ప్రేమ-పిలుపు (361)

ప్రేమ-పిలుపు 

కమ్మని కల - కౌగిలికి చేరే వేళ

ఉదయించే కిరణం - వెలుగుని ప్రసాదించే వేళ

ఆ హాయిని ,ఉషోదయానికి స్వాగతం చెప్పలేక

విఘాతం కలిగించిన విఘాతకుడిని

అందివచ్చిన ప్రేమఫలాన్ని అందుకోలేక

రాహువులా సూర్యుడినే మ్రింగిన గ్రహణాన్ని

అవకాశం వినియోగించుకోమని సూచిస్తుంటే

అహంకారం తరిమికొట్టమని ఆజ్ఞాపించింది 

అనుభవం వలపు వన్నెలలో విహరిస్తుంటే
ప్రస్థుతం చీదరింపులకి దగ్గరవుతుంది

నా ప్రేయసి పిలుపుని వినలేకపోయాను
మది తలుపుని గట్టిగా బిగించుకున్నాను 

ప్రేమాంతరపు లోతుల్లో తొంగిచూడలేక
ఆలపిస్తూ ,విలపిస్తున్నాను ప్రియమైన దానికోసం

తన చొరవని ,ఆజ్ఞ అనుకుని హద్దు గీసుకున్నా 
తన ప్రేమని ,భ్రమ అనుకుని శిక్షను అనుభవిస్తున్నా

తగిన శాస్త్రి కావాల్సిందే నాకు
తనను అభిమానించలేని ఆభాగ్యుడినిగా 

Related Posts:

  • కవిత నెం 200:గుండె చప్పుడు కవిత నెం :200 గుండె చప్పుడు  నాలో నేనే నీలా  నీలో నీవే నాలా  ఒక్కసారిగా ఒక్కటై  ప్రతిస్పందన మొదలై  మనలో మనమే చేరగా  … Read More
  • కవిత నెం 202:రైలంట రైలు కవిత నెం : 202 రైలంట రైలు దీనికి ఉండదంట వేలా పాలు ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు కూస్తూ ఉంటుంది రైలు బెల్లు  ఆగిన చోట ఉండదు ప్రతీ చోటా ఇది ఆగదు కా… Read More
  • కవిత నెం 198:మౌన శబ్దం కవిత నెం :198 *మౌన శబ్దం * కలలు అలలై కావ్యమై  కురిసినవి వర్షపు చినుకులై  కదిలించే నాలో తలపులే  కదిలోచ్చే నాతొ ఊహలే  ఎదలో చెర… Read More
  • కవిత నెం 197:ఒకరిలో ఒకరం కవిత నెం :197 *ఒకరిలో ఒకరం * నువ్వున్నావులే నా కోసమే  నా జన్మాంతము నీతో సాగులే  నింగీ నేలకు దూరం&nb… Read More
  • కవిత నెం 199:అసమాంతరాలు కవిత నెం :199 *అసమాంతరాలు * అక్షరాలు రేకుండా పదాలు సమకూర్చలేము  అవాంతరాలు లేకుండా గమ్యం చేరలేము  ఏది ఏమైనా నిజాన్ని నమ్మలేము  అను… Read More

0 comments:

Post a Comment