Friday, 27 June 2014

కవిత నెం32:పటమట లంక

కవిత నెం :32

పటమట లంక 

నేను ఉండేది పటమటలంక
అది ఉంటుంది అందంగా ఎంచక్కా 
దాని మూలం విజయవాడలోని బెంజి సర్కిల్ పక్కన 
 నాలుగు జంక్షన్ (ఏలూరు ,గుంటూరు,హైదరాబాద్ ,బందరు ) లకు నిలచెను మధ్యన 
అన్ని పట్టణాలకు ప్రెవేటు బస్సుల సౌలబ్యం  ఉన్న చోటు 
''ఈనాడు పేపర్ ప్రెస్ '' మొదటగా స్తాపించన చోటు 
దానికి ఎదురుగా పెద్ద గ్రందాలయం అగుపించే చోటు 
విద్యార్దులకు గొప్ప గొప్ప విద్యాసంస్థలను అందించిన చోటు 
''రామయ్య మెస్ '' బహుగా రాణించిన చోటు 
''స్వీట్ మ్యాజిక్ '' సోయగాలాను మురిపించిన చోటు 
చిన్న ,పెద్ద వ్యాపారులకు ఆహ్వానం పలికిన చోటు 
పేరిడిన బ్యాంకులకు వారధిని కల్పించిన చోటు 
పవిత్రతకు అద్దం  లాంటి దేవాలయములను కలిగియున్న చోటు 
విలాసాలకు ,ఆహ్లాదాలకు మల్టీప్లెక్స్ లను సృస్టించిన చోటు 
ఇది  ఒకప్పుడు రౌడీలకు అడ్డా 
నేటి రాజకీయాలకు గడ్డ  
 ఇప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి 
శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కాలనీ నెలసిన చోటు 
ట్విన్స్ సంక్రాంతి అంటూ ఉల్లాసం ఇచ్చిన చోటు 
అన్ని రకాల ఫ్యాన్స్ అసోసియేషన్స్ నెలకొన్న చోటు 
రైతులకు అండగా ,వినియోగదారులకు మెండుగా 
''రైతు మార్కెట్ '' నిర్మింపబడిన చోటు 
ప్రెవేటు కంపినీలకు పురోగతిని చూపిన చోటు 
డా// శ్రీదర్ మరియు డా//సమరం లాంటి అద్బుతమైన 
వైద్యుల నిలయమయిన చోటు 
అందంలో అయినా ఆర్బాటంలో అయినా 
అదరహో అనిపించే ఆహ్లాదకరమయిన చోటు 
ఈ పటమట లంక ............................... 
దీనికి ఉండబోదు ఏ  వంక 

Related Posts:

  • కవిత నెం174:చెలియా గుర్తోస్తున్నావే కవిత నెం :174 చెలియా గుర్తోస్తున్నావే  (13 .07 .2011 ) చెలియా గుర్తోస్తున్నావే చెలియా చంపెస్తున్నావే చెలియా జ్వాలనే పుట్టిస్తున్నావే చె… Read More
  • కవిత నెం 175:తెలుసా ? కవిత నెం :175 తెలుసా ? (27 .07 .11) మౌనంగా ఎగిరే ఆ పక్షుల బాష తెలుసా ! ఒక దిక్కుకై నిలిచే ఆ పువ్వుల శ్వాస తెలుసా! నేనంటూ నడిచే - నా పయనం ఎటో త… Read More
  • కవిత నెం177:శశి కళ కవిత నెం :177 నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది. నిదురిస్తే నీ రూపం తట్టి లేపుతుంది. మేల్కొని వుంటే నీ తలంపు మైమరపిస్తుంది. మైకంలో వున్నా… Read More
  • కవిత నెం178:హాయ్ - హలో కవిత నెం :178 హాయ్ ; హలో  సముద్రమంతా ఎంత సరదాగా విహరిస్తుందో  ఆకాశమంతా  ఎంత నిర్మలంగా వికసిస్తుందో  అలాగే నా మనసు నీతో సరద… Read More
  • కవిత నెం 176:నీ కోసం కవిత నెం :176 నీకోసమే ఉన్నా నీకోసమీ జన్మా నీ కోసమై అన్వేషణ నీ కోసమై ఆలోచన నీ కోసమై నా తపన నీ కోసమై నిరీక్షణ నా కన్నుల్లో తడి ఆరదు నీ కోసం… Read More

0 comments:

Post a Comment