కవిత నెం :159
వేశ్య ఎవరు ?
ఏ బ్రహ్మకలం నుండి జారిన పదం ఇది
ఏ పరబ్రహ్మ సృష్టించిన జన్మ ఇది
ఎవ్వరు ఈమెనిలా మార్చివేసినది
ఏ దృతరాష్ట్రుని చేతినుండి పుట్టిన దౌర్భాగ్య స్థితి ఇది
అవగాహన లేనితనం సాని గృహాలకు బలౌతుంది
అవకాశమిచ్చిన కాలం ''వేశ్య '' బిరుదును బహుమతినిస్తుంది
పిలువటానికి సిగ్గు పడే పేరు కదా అది
తలవటానికే పనికిరాని బూతుపదం కదా అది
మరి ఎంతో మంది విలాసాల వస్తువైనది
కొన్ని తలరాతలు మార్చే సిరా అయినది
కూటికోసం కోటి విద్యలే - మరి ఈ విద్య ఎలా అబ్బినది
స్వేచ్చ ఉన్నా,...
Sunday, 28 June 2015
Saturday, 20 June 2015
కవిత నెం 158:నాన్న నువ్వంటే ఇష్టం
కవిత నెం :155
నాన్న నువ్వంటే ఇష్టం
నువ్వంటే ఇష్టం నాన్న
నీ రూపం నా ఊహలకు మాత్రమే పరిమితమైనా
నువ్వంటే ఇష్టం నాన్న
నీ వేలుపట్టి నడకనేర్చింది గుర్తులేకపోయినా
నువ్వంటే ఇష్టం నాన్న
నీ భుజాలపై , ఆడుకున్నది జ్ఞాపకాలకే సొంతంఅయినా
నువ్వంటే ఇష్టం నాన్న
నన్ను నీ గుండెకు హత్తుకున్న స్పర్శ నాకు దూరంఅయినా
నాన్నంటే .... తన మనసు వెన్న అని
నాన్నంటే .... నిలువెత్తు రూపం అని
వింటుంటే నా చెంత నువ్వెందుకు లేవనిపిస్తుంది నాన్న
పుట్టింది అమ్మ కడుపులో నుంచైనా
నా జన్మ నీ రక్త సంబంధమే...