కవిత నెం :223
హాయ్ బంగారం
నీకు నేను గుర్తొస్తున్నానా ?
కాని నాకు మాత్రం నువ్వు గుర్తొస్తూనే ఉంటావు
అనుక్షణం ......... అనునిత్యం ....... నీ జ్ఞాపకాలే
కలలో ...... ఇలలో ...... నీ ఊహలే
ఒంటరితనం అలవాటు పడటం లేదు
నీ తోడు నాకు పరిచయం అయ్యాకా
ఒక్కడిగా మనసుకి సర్ది చెప్పలేకపోతున్నాను
ఇద్దరుగా కలిసి ఒక్కటి అయ్యాకా
నీకు నా ఆలోచన ఉంటుందో లేదో తెలియదు
కాని నా ధ్యాసెప్పుడూ నీకై తపిస్తూ ఉంటది
ఎలా ఉన్నావు ? ఏమి చేస్తున్నావు అనే ప్రశ్నలు
నా నీడలా వెంటాడుతూ నిన్ను గుర్తు చేస్తూ ఉంటాయి
గాలి గుర్తుచేస్తుంది గాల్లో తేలిన సంఘటనలని
వాన చినుకు గుర్తుచేస్తుంది...
Saturday, 23 July 2016
Tuesday, 19 July 2016
కవిత నెం 222 :తప్పు
కవిత నెం :222
*తప్పు*
తప్పు చేయకున్నా తప్పేనని ఒప్పించనేల
తప్పు చేసి తప్పించుకొనెడివాడి తల తీయకుండనేల
తప్పులలో కొన్ని ఒప్పులున్నా తప్పే అనెడి వాదమునేల
తప్పిదము చేసినచో ఒప్పుకునే సాహసము ఎవ్వరికుండ గలదు
ఈ ప్రపంచంలో జీవించెడివాడులో ......... ఓ సీతారామ...
Wednesday, 6 July 2016
కవిత నెం 221:నా ప్రేమాక్షరాలు
కవిత నెం :221
*నా ప్రేమాక్షరాలు *
నీ మందారవింద సుందరమోము చూసి
నాలోన తేజము ఉత్సాహముగా ఉద్భవించే
నీ నోటి ముత్యపు పలుకులను శ్రవించగా
నాలోని మౌనము స్వరగంధులను చీల్చుకువచ్చే
నీ నయనములలోని పొంగివచ్చే ప్రేమ చూసి
నా హృదయము తన్మయత్వం తో పులకరించే
నీవు నా కనులముందు పుత్తడిబొమ్మలా కదులుతుంటే
నేను అగరబత్తిలా నీ చుట్టూ వ్యాపించి యుండిపోనా
నీ స్పర్శ నా నుదుటిని తాకిన వెంటనే
నాలోని పైత్యము నన్ను వీడి , మనోల్లాసము కలిగించెగా
నీ ఆగమనం కోసం ఎదురుచూస్తూ
నా పాదాలు నా...