కవిత సంఖ్య :281
జీవితమే ఒక ప్రశ్న
ఏదో వెతుకులాట
ఎక్కడికో ప్రయాణమట
ఎంత ఉన్నా ,ఏమి తిన్నా
తృప్తి లేని మనిషి
తన అవసరాలకు మించి
పరితపిస్తుంటాడు
భాదలు - బంధాలు
కష్టాలు -సుఖాలు
ఆరాటలు -పోరాటాలు
సమస్యలు - ప్రశ్నలు
గెలుపు -ఓటమిలు
కోపాలు - ప్రేమలు
ఆశ -నిరాశ
తప్పు -ఒప్పులు
కాలంతో పయనించే
మానవ జీవితం
అర్ధమవ్వని ఒక ప్రశ్నార్థకం
నిరంతర గమనం
నియమం లేని జీవి...
Thursday, 30 March 2017
Tuesday, 28 March 2017
కవిత సంఖ్య : 280* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు *
కవిత సంఖ్య : 280
* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు *
మావి కొమ్మలు
మల్లె రెమ్మలు
కోయిలమ్మలు
లేలేత చిగురులు
వేప పువ్వులు
చెఱుకు గడలు
బంతి- చేమంతులు
పుడమి తల్లి కాంతులు
తొలకరి జల్లులు
విరిసిన హరివిల్లు
ముంగిట్లో రంగవల్లిలు
అంబరాన మెరిసిన శోభలు
కోవెల గంటలు
రమణుల వంటలు
షడ్రుచుల సమ్మేళనాలు
వేద పఠనాలు
పంచాగ శ్రవణాలు
పర్వదిన సంబరాలు
స్వాగతాలు
స్వగతాలు
నవ వసంతాలు
కొత్త ఉత్సాహాలు
పచ్చదనాలు
ప్రకృతి రమణీయాలు
మామిడి తోరణాలు
ప్రతీ ఇంట ఉత్సావాలు
ఈ 'ఉగాది 'ఉషోదయాలు
శ్రీ హేవిళంబి
నామ సంవత్సర
శుభాకాంక్షలు ......
- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద...
Sunday, 19 March 2017
కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !)
కవిత సంఖ్య :279
కవితా శీర్షిక : వస్తుంది ఉగాది !
తెలుగింటి ముంగిలి లోకి
ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది
స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అందివ్వటానికి
పిండి వంటల ఘుమ ఘుమలతో ..
ఉవ్విళూరిస్తూ.. వస్తుంది ఉగాది
ఉరకలేసే సంతోషాల సంబరం తేవటానికి
కొత్త కొత్త అందాలను తనతో తెస్తూ వస్తుంది ఉగాదిఆమని సొగసులతో .. పగడాలను కూర్చటానికి
కమనీయమైన ఆలాపనతో వస్తుంది ఉగాది
కోయిలమ్మ పలుకులు వినిపించటానికి
మురుస్తూ ,మెరుస్తూ వస్తుంది ఉగాది
మామిడాకుల తోరణాలతో మది నింపటానికి
పరిపూర్ణమైన పచ్చదనంతో వస్తుంది ఉగాది
ప్రకృతితో...