Monday, 29 May 2017

కవిత నెం :292(మనసు వాంచ)

కవిత నెం :292
*మనసు వాంచ *

మనసారా ఉండాలనీ
మనసు మాట పంచాలనీ
మనసు కిటికీ తెరవాలనీ
అనుకుంటూ చలిస్తుంది ఆ మనసు
ప్రతి స్పందనకై ఎదురుచూస్తూ

తేనెపూసే మాటలొద్దు
తేనెలొలికే మాట చాలు
మత్తు జల్లే మనసు వద్దు
బాధపడినా నిజమే ముద్దు

ముందరకాళ్ల బంధమొద్దు
వెన్నుతట్టే హస్తమే హద్దు
నీ నవ్వులో ఒక చూపు చాలు
నీ నవ్వుతో ఒక పలకరింపు చాలు

మనసంటూ ప్రతీ వారికి
మనసంటూ ఒకటుంటుంది
మనసుని నొప్పించకండి
కుదిరితే మీ స్వచ్ఛనీయమైన
స్నేహంతో మనసుని మెప్పించండి

అదే అదే ఈ మనసు వాంఛ

- గరిమెళ్ల రాజేంద్ర ప్రసాద్ 

Related Posts:

  • కవిత నెం72:బాల్యం కవిత నెం :72 బాల్యం అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం అనుభూతుల పుస్తకం - అరు… Read More
  • కవిత నెం73:బాల్య సొగసులు కవిత నెం :73 బాల్య సొగసులు  : (శ్రీ పద్మ ) ************************************ అమ్మపొత్తిళ్ళలో  ముద్దుగా మురిసిన బాల్యం నాన్న గ… Read More
  • కవిత నెం70:అంత్యాక్షరి కవిత నెం :70 అంత్యాక్షరి  *************************** అందరినీ అలరించే సరిగమ లహరి  మెదడుకు పదునుపెట్టే సంగీత కచేరి గాత్రాలకు పని చెప్పే గా… Read More
  • కవిత నెం 77:ప్రేమ కోసం - కవితా ''కారం '' కవిత నెం :77 ప్రేమ కోసం - కవితా ''కారం '' **************************** నమస్కారం ! నువ్వంటే నాకు ''మమకారం'' కాదు అది ''చమత్కారం''  నీ నవ్వు ఒక '… Read More
  • కవిత నెం71:వెన్నెలమ్మ ఒడిలో కవిత నెం :71 వెన్నెలమ్మ ఒడిలో *********************************** జామురాత్రి  నీడలో ,జాబిలమ్మ జోలలతో వెండిమబ్బుల కాంతులలో ,నీలిరంగు వెన్నెలలో ఆ… Read More

0 comments:

Post a Comment