Wednesday, 24 May 2017

కవిత నెం :288(నీ ప్రేమలో నా గమనం)

కవిత నెం :288
* నీ ప్రేమలో నా గమనం *

నిన్ను చూస్తే నా కలం సాగుతుంది
నిన్ను చూసాక నా కవిత పొంగుతుంది
నీవున్న చోట ప్రేమ పరిమళిస్తుంది
నీతో కలిసి నడిచే బాట లక్ష్యాన్ని చేర్చుతుంది

నీ మాటల ముత్యాలతో నాలో నవ్వుల జల్లు కురుస్తుంది
నీ సొగసుల వలపు ఆస్వాదించగా అమరత్వం సిద్ధిస్తుంది
నీ కనుల బాస నేర్వగా నాలో జ్ఞానం ప్రకాశిస్తుంది

నీ సాంగత్యం దక్కించుకున్న నేను
అమరేంద్ర రాజేంద్రుడను నేను
నీ ప్రేమ తత్వంతో ముగ్దుడనవుతున్న నేను
భూలోకపు ఇంద్రుడను నేను

నన్ను వలచిన ఈ దేవి దేవతగా వారాలనందిస్తుంటే
నిన్ను పొందగా ఈ జన్మ నూతనత్వాన్ని వసగా పోసుకుంటుంది

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు


Related Posts:

  • కవిత నెం269: నిశీధిలో నేను కవిత నెం :269 * నిశీధిలో నేను * నిశీధిలో నేను  దిక్కులు  చూస్తున్నాను  ఆరుబయట మంచం మీద  చల్లని గాలి మెల్లగా చేరి … Read More
  • కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న ) కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న న… Read More
  • కవిత నెం263:మేలుకో నవతేజమా కవిత నెం :263 *మేలుకో నవతేజమా * సమాజాం పిలుస్తుంది రా కదలిరా నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా కలం పట్టి గళం పాడే చోట… Read More
  • కవిత నెం :296(* ఎందుకు గాబరా *) కవిత నెం :296 * ఎందుకు గాబరా * ఒకరికోసం నీ గమ్యం ఆగకూడదు ఒకరికోసం నీ మార్గం నిర్దేశింపబడకూడదు ఎవరు  నువ్వో ఈ భూమిపైకి రాకముందు ఎవరు నువ్వు అనే… Read More
  • కవిత నెం :302(మాతృత్వపు ధార) కవిత నెం :302 *మాతృత్వపు ధార * తాను తల్లి కాబోతున్న అనే వార్త వినగానే తన్మయత్వంతో పులకించిపోతుంది ఆ తల్లి హృదయం ఎన్నో ఆశలు కళ్లలో దాచుకుని ఎన్నో ఊ… Read More

0 comments:

Post a Comment