Saturday 29 April 2017

కవిత నెం :287(తనే నా వసంతం)


కవిత నెం :287
*తనే నా వసంతం *


నడుస్తూ రోజులు గడిచిపోతున్నాయి
పరిగెడుతూ నెలలు మారిపోతున్నాయి

నా అడుగులో అడుగై
నాలో సగమై
నా జీవితంలోకి అడుగుపెట్టి
నేనే తన లోకమని భావించి
తన గురించి తానే మర్చిపోతుంది

ఈరోజు ఒక మంచిరోజు - నాకు పండుగ రోజు
నా నెచ్చెలి ,నా ప్రాణం జన్మించిన రోజు
నా అర్ధాంగిగా తన నాల్గవ పుట్టినరోజు

 *************************************

తనతోనే సంతోషం
తనతోనే సమస్తం
తానే నా ప్రపంచం

గొప్ప ఆలోచనలు తనవి
నిర్మలంగా కనిపించే ముఖారవిందం తనది
స్వచ్ఛంగా సాక్షాత్కరించే చిరునవ్వు ఆమెది

అదృష్టాన్ని చూసి మోసపోదు
కష్టాన్ని నిముషమైనా వదలదు
పట్టుదలతో సాగిపోయే జీవితం ఆమెది

నేర్పుతూ గురువుగా ఉంటుంది
నేర్చుకుంటూ విద్యార్థిగా ఉంటుంది
నిరాడంబరంగా అణుకువతో ఉంటుంది

మురిసిపోయే బహుమతి నివ్వలేకపోయినా
వేద పండితుల ఆశీర్వచనంతో

తన పుట్టిన రోజు జరిగింది ......

అందమైన రోజులు
అందుకోబోయే విజయాలు
నీ ముందుకు రావాలని

సుదూరమైన గమ్యాలను ,
సులువుగా దాటుతూ
నీ గమ్యం ఒక మార్గదర్శకంగా ఉండాలని

కోరుకుంటూ .....

మరుమల్లి  పరిమళాలతో
పున్నమి పసిడి కాంతులతో

''పుట్టిన రోజు శుభాకాంక్షలు ''








0 comments:

Post a Comment