Thursday 6 April 2017

కవిత నెం 283(నేటి చిన్న తనం)

కవిత నెం 283
* నేటి చిన్న తనం *

వివేకమో ,అవివేకమో తెలియదు
గర్వమో , గారాభమో తెలియదు
 కదిలిస్తే చాలు నాగు పాము పాము బుసలు
క్షణికంలో మారిపోయే మనసు తత్వాలు
ఏ కాలంలోనైనా ,గతించిన కాలమే మేలు
పెద్దలయందు ఒక గౌరవం ,భక్తి ఉండేవి
కలికాలమహిమ ఏమో కాని ....
కనువిప్పు కల్గదు నేటి జనాలకు కానీ
అంధకారంలో కనులు మూసుకుని ఉంటాయి
వెర్రి జాలం ఒకవైపు , అమాయకత్వం మరో వైపు
తెలుసుకుని మసులుదామనే కించిత్ ప్రయత్నం లేదు
అహం బ్రహ్మాస్మి అనే పొగరు పూసిన చిగురు
నేనే కదా అంటూ సాగే నేటి కధలు ఎన్నెన్నో
నేనుంటే చాలుకదా అనే నక్కవినయాలు మరెన్నో
ఏమి వస్తుంది సుమీ మీకు ఎగిరెగిరి పడితే
పద్దతి -పాడు అంటూ కొన్ని ఏడ్చాయి
అవి మీరు గమనించు కోగల్గితే !

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

0 comments:

Post a Comment