Friday 14 April 2017

కవిత నెం :285(శ్రీ సూర్య నారాయణుడు)

కవిత నెం :285

* శ్రీ సూర్య నారాయణుడు *

సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేవాడా - నీకు వందనం
స్వయం ప్రకాశ తేజోమయరూపమా - నీకు వందనం
సమస్త మానవాళికి జవజీవాలను ప్రసాదింపేవాడా - నీకు వందనం

అదితి పుత్రుడా ! అగ్ని గర్భుడా  - నీకు వందనం
స్థితికారకుడా ! దినకరుడా  -నీకు వందనం

ప్రభాకరుడా ! భువనేశ్వరుడా - నీకు వందనం
ప్రభాత ఉషోదయంతో మేల్కొలిపే భాస్కరుడా   - నీకు వందనం

సర్వ దేవతలయందు మిళితమైనవాడా - నీకు వందనం
సమస్తలోక జీవరాశికి జీవం కల్పించేవాడా - నీకు వందనం

బంగారుకాంతితో ప్రకాశించేవాడా - నీకు వందనం
ఏడు గుఱ్ఱాల రథంతో ఆకాశయానం చేయువాడా - నీకు వందనం

అంధకారాన్ని పోగొట్టే వాడా - నీకు వందనం
ఆనందాన్ని ,శుభాన్ని కల్గించే వాడా - నీకు వందనం

కాలచక్రాన్ని ముందుకు నడిపేవాడా - నీకు వందనం
ఆరు ఋతువులకు కారణమైన వాడా - నీకు వందనం

సప్తేంద్రియములకు మూలకారకుడా - నీకు వందనం
సర్వ  క్లేశములను తొలగించేవాడా - నీకు వందనం

సకలలోక పారంగుడా -నీకు వందనం
సృష్టికి లయకారకుడా - నీకు వందనం

మహాతేజం కల్గిన మార్తాండుడా - నీకు వందనం
తీక్షణమైన రుద్రరూపం కల ఆదిత్యుడా - నీకు వందనం

ఆకాశానికి అధిపతిగా నిలచినవాడా - నీకు వందనం
అందరికీ ఆదర్శ దైవమా - నీకు వందనం

మానవాళిచే పూజింపబడినవాడా - నీకు వందనం
ప్రత్యక్ష శ్రీ నారాయణుడా - నీకు వందనం

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్

0 comments:

Post a Comment