Wednesday, 24 May 2017

కవిత నెం :290(మారాలి)

కవిత నెం :290

మారాలి మారాలి
ఈ ప్రపంచం మారాలి
నువ్వూ మారాలి నేనూ మారాలి
మనం మారాలి ఈ జనం మారాలి
చూస్తూ ఉంటే రోజులు పోతాయి
కూర్చుని తింటే కొండలు కరుగుతాయి
మనకెందుకు అనుకుంటే
మనల్ని కూడా వదిలించే రోజులు వస్తాయి
ముందుకు కదిలితేనే అడుగు పడుతుంది
వెనకకి తిరిగితే లక్ష్యం దూరమవుతుంది
మారాలి మారాలి
ఈ ప్రపంచం మారాలి
ఎదో ఒకసారి
ఎప్పుడో ఒకప్పుడు
ఎక్కడో ఒకచోట
మార్పు అనేది అవశ్యం
మార్పు ఉండనిదే తత్వం మారదు
మార్పు లేనిదే వ్యక్తిత్వం పుట్టదు
మనం మారుతూనే ఉంటాం
మన పరిసరాలు మారుతూనే ఉంటాయి
కదిలే కాలంతో పాటు
కదిలే మనుషులతో పాటు
మనమూ మారకతప్పదు
మనలో కొంతైనా మార్పు రాక తప్పదు
కాబట్టి మార్పు అనేది ఉండాలి
మార్పు అనేది జరగాలి
ఒక పెనుమార్పు ప్రపంచాన్నే మార్చేస్తుంది
మార్పుకి సమయం , ముహూర్తం ఉండదు
మార్పు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు
మార్పు జరిగితే సంతోషించు
మంచి మార్పు కోసం నువ్వు పరిత్యజించు
ఒక మార్పుతో నీ జీవితాన్ని కొత్తగా జీవించు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

Related Posts:

  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం88:బార్యంటే కవిత నెం :88 బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా ఏడు అడుగులు కలిసినప్పుడు నీ… Read More
  • కవిత నెం91:ATM కవిత నెం :91 ATM ఓయ్ నేనే అంటే నీకు తెలుసా ? తెలియదు ఎందుకు తెలుస్తుంది నా పేరు ATM ALL TIME MONEY అని నన్ను పిలుస్తారు అవసరమైన టైం లో ఆకస్మాత… Read More
  • కవిత నెం87:కులము కవిత నెం :87 కులము కులము అంటూ కూడికలు ఎందుకు ? మతము మతము అంటూ మైనస్సులు ఎందుకు ? సమానత్వమనే భావనతో సరి తూగలేరా ? వ్యంగంగా కులమంటూ పరిహాసమేలా ? నువ్వొ… Read More
  • కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు కవిత నెం :89 నేటి పదవులు - వాటి విలువలు  ఏమిటి ఈ రాజకీయము  ఎక్కడుంది ప్రజాస్వామ్యము  మన నాయకుల ఇష్టారాజ్యము  ఎటువెళ్తుంది ప్రజ… Read More

0 comments:

Post a Comment