Tuesday, 4 July 2017

కవిత నెం :296(* ఎందుకు గాబరా *)

కవిత నెం :296
* ఎందుకు గాబరా *

ఒకరికోసం నీ గమ్యం ఆగకూడదు
ఒకరికోసం నీ మార్గం నిర్దేశింపబడకూడదు

ఎవరు  నువ్వో ఈ భూమిపైకి రాకముందు
ఎవరు నువ్వు అనేది నువ్వు నిరూపించుకోవాలి

ఒక అవకాశం నీకై ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది
అనవసరంగా నీ లక్ష్యాన్ని గందరగోళంలో ఉంచకు

ఆట అంటే ఆడతాము ,ఓడతాము ,తిరిగి గెలుస్తాము
జీవితం అనే ఆటలో ఎప్పుడూ గెలవాలని కోరుకో

ప్రతీ విషయానికి క్షుణ్ణంగా వెళ్లి మనసు పాడు చేసుకోకు
నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ కార్యదీక్షుడవు కమ్ము

నీ వంతు కృషిని ఎప్పుడూ అసమాలోచన చెయ్యకు
నీతి ,నిబద్ధతలతో నీ గమ్యాన్ని సరాళం చేసుకో

ఏదో ఒక కార్యం నీ కోసం ఈ సృష్టిలో మమేకమై ఉంటుంది
నిరాశ ,నిసృహ లతో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు సుమీ

అందమైన జీవితం హాయిని మాత్రమే కోరుకోవాలి
బరువు ,భాద్యతలు ఎన్ని ఉన్నా సంతోషంతో ముందుకు సాగాలి

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
# 05. 07. 2017


Related Posts:

  • కవిత నెం36:వాయువు కవిత నెం :36 //వాయువు // పంచభూతములలో ఇది ప్రముఖమైనది విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది సకలచరాచరసృష్టి కి జీవనాద… Read More
  • కవిత నెం39:మారండి కవిత నెం :39 మనుషుల్లారా మారండి మనుషులమని గుర్తించండి మనకు మనమే బంధువులం మనకు మనమే స్నేహితులం మనకు మనమే ఆత్మీయులం మనకు మనమే శత్రువులం మానవ జన్మ ఒ… Read More
  • కవిత నెం38:స్నేహం కవిత నెం :38 స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం '' మరణం లేని అమరం ఈ… Read More
  • కవిత నెం34:ద్రాక్ష కవిత నెం :34//ద్రాక్ష// ద్రాక్ష - ఫలములలో రాణి అని దీని పేరు వైటాస్ కుటుంబం నుంచి వచ్చిన ఫలము బెర్రీ ఫ్రూట్ అన్ని దీనికి ఉంది మరొక పేరు ద్రాక్షలో మన… Read More
  • కవిత నెం 35:నదీ స్నానం కవిత నెం :35 //నదీ స్నానం// ***************************** సకల ప్రాణ రాశులకు  ఇది జీవ ధరణి ప్రవహించే నదిలో చేయు నదీస్నానం పవిత్ర ఆరోగ్యాబివృ… Read More

0 comments:

Post a Comment