Tuesday, 6 June 2017

కవిత నెం : 295(దిక్సూచి)

కవిత నెం : 295

*దిక్సూచి *

కసిగా ఉండాలి
మసి తొలగించాలి
పట్టుదలతో నువ్వే విజయం పొందాలి


క్రమశిక్షణ ఉండాలి
విద్యార్థిగా మెలగాలి
నీ ఓర్పుతో ఉన్నతంగా ఎదగాలి

భవిత మీదే ఈ కవిత నాదే
శ్రమలో పుడితే  గెలుపు మీదే

రేపటి సూర్యులు మీరు
నేటి సమిధలు మీరు
ఎదిగే మొక్కలు మీరు
నేటి విత్తులు మీరు

నీ లక్ష్యాన్ని ఎంచుకో
నీ లక్షణాన్ని తెలుసుకో
నీ గమ్యాన్ని మలుచుకో
గగన విహంగమై దూసుకుపో

భవిత మీదే ఈ కవిత నాదే
గతము చూస్తే గుబులు రాదే

ఆశల సౌథం మీరు
రేపటి ఆశాకిరణం మీరు
అక్షర ద్వీపం మీరు
రేపటి అక్షర ఆయుధాలు మీరు

నీ ఆశయం నిలుపుకో
నీ అభివృద్ధిని నిర్మించుకో
నీ గమనాన్ని మార్చుకో
నేటి ప్రపంచంలో నిలిచిపో

భవిత మీదే ఈ కవిత నాదే
కష్టపడితే ఫలము నీదే


- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్
Dt : 06. 06. 2017









Related Posts:

  • కవిత నెం170:వెన్నెల కవిత నెం :168 వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల నీ యొక్క సుమధుర కాంతులతో నా యదలో వెలుగు బాట పరిచిన వెన్… Read More
  • కవిత నెం172:నా గమ్యం 30.05.2006 కవిత నెం :172 నేస్తమా నీ ఒక నీడ  అది ఒక తెలియని జాడ స్నేహమగునా ఈ ఎడారి ఓడ ....... రహదారిలో గోదారిలా నా దారిలో చేరావు నా గుండ… Read More
  • కవిత నెం 169:మనసు మాయజాలం కవిత నెం :169 *మనసు మాయజాలం * నా మనసు మాయజాలలో  విహరిస్తుంది స్వప్నలోకాలలో సంచరిస్తుంది నిన్ను చూడని ప్రతి నిముషం నా హృదయంలో మొదలు పరవశం&nbs… Read More
  • కవిత నెం 173: నీ ప్రేమ కావాలి కవిత నెం :173 నీ ప్రేమ కావాలి. (05 .07.11) ప్రేమ కావాలి - ప్రియా నీ ప్రేమ కావాలి నన్నే కళ్ళల్లో దాచుకునే - నీ ప్రేమ కావాలి. నన్నే నీ పెదవుల… Read More
  • కవిత నెం168:ఆమె కవిత నెం :168 ఆమె ఆమె పేరంటే ఇష్టం. ఆమె రూపంటే ఇష్టం ఆమె కాలికున్న మువ్వలంటే ఇష్టం ఆమె చెవులకు అమరినదుద్దులంటే  ఇష్టం ఆమె ముక్కుని అ… Read More

0 comments:

Post a Comment