1, జూన్ 2017, గురువారం

కవిత నెం : 294(వయ్యారిభామ)

కవిత నెం : 294

*వయ్యారిభామ  *

ఎందుకు వస్తావు
ఎందుకు వెళ్తావు

నా మనసుని గిల్లుతావు
గిల్లి లొల్లి పుట్టిస్తావు
ఇంతలో మళ్లీ కానరావు

పెదవిపై నవ్వు కాయగానే
ఎదలో భాదవై గుచ్చుతావు
నవ్వుతూ ఎదురొస్తావు
వలపుల వాలిపోతావు
నా తలపులోంచి జారుకుంటావు

తుమ్మెదలా తిరుగుతుంటావు
నా చుట్టూ చేరి అల్లరిచేస్తావు
అమాంతంగా ఎగిరిపోతావు

నిన్ను చూసే కనులకు వెలుగైతావు
చీకటి తెరలను చెదుర్చుతావు
నిప్పు కణికలా వాతపెడతావు

నీ స్నేహంలో విహరించగలను
నీ విరహం నేను భరించలేను
నీ ప్రేమకు దాసుడను నేను
నా అపురూప సుందరి నీవు
నా ప్రేయసి నీవు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి