Tuesday, 12 September 2017

కవిత నెం : 301// ప్రేమ యాన్ //

కవిత నెం : 302 // ప్రేమ యాన్ // నీ వడి వడి పలుకులు నాలో జడి రేపేనే నా మడి గిడి అంతా సడి ఆయేనే నా మదిలో ఏదో అలజడిగా మెదిలి నా గుండెలో గుడిగా నీకై  వెలిసినే నిన్ను చూసి నా కనులకు అదృష్టమే నిన్ను తలచి నా స్వప్నం అదృశ్యమే ఏవేవో మంత్రాలు నాకు వినిపించెనే నీ పేరు లాగే అవి గాంచెనే నన్నే నేను మై మరచానే నిన్నే ఎదలో ధ్యానించానే నీ చేతిలో శిలలాగ   అగుపించానే నీ స్పర్శతో నూతనంగా ఉదయించానే నీ ముద్దుతోటి మరల జన్మించానే నీ ప్రేమతోటి నేను పులకించానే నన్ను నే మరచానే నిన్నే ధ్యానించానే నా ప్రేయసి నాకై దిగివచ్చావే నా రాక్షసి నీకై తిరిగొచ్చానే - గరిమెళ్ళ...

కవిత నెం :300//భగ్న ప్రేమ //

కవిత నెం :300 //భగ్న ప్రేమ // నిలుచున్నా నీ నీడల్లో నీకోసం నిలుచున్నా నీ తలపుల్లో నీ కోసం మబ్బులలో విహరిస్తున్నా నా జాబిలి కోసం నీరులా ప్రవహిస్తున్నా నీ ఒడి కోసం నాలో నేనే అన్వేషణ - నీకై నీకై ఆరాధన నీ ప్రేమ చిగురు పొందితే చాలదా నీ   పెదవంచున   పేరులా మారితే చాలదా ఓ ప్రియా తపిస్తున్నా ఆ దేవుణ్ణే నీ కోసం పూజిస్తున్నా ఆ రాధనే నా దేవి కోసం బ్రతికేస్తున్నా నిర్జీవమై నీ ప్రేమ  కోసం భరిస్తున్నా ఈ జన్మనే నీ ప్రేమ కోసం - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు ...

Wednesday, 6 September 2017

కవిత నెం : 299 (జీవం -నిర్జీవం)

కవిత నెం : 299 * జీవం -నిర్జీవం * ఒకవైపు ఆనందం ఆకాశం వైపు మరోవైపు విషాదం ఆందోళన వైపు కనులముందు కాంతులే వెదజల్లుతున్న అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసునా సాధించానని విజయం ఒకవైపు నీ విజయం పరాజయమని వెక్కిరింపు మరోవైపు ఒక్కమాట నీ మనసుకి హాయినిస్తున్నా కోఠి ప్రశ్నలు నా బుర్రను నలిపేసునా బంధాలకు దూరమయి గుండెరాయైనా ఏదో భారం ఎదలో అణుభారమై అన్వేషణ సంతోషాల సంబరాల కోసం ఏదో సమాలోచన సంబంధం లేని విషయమేదో దాడిచేసునా ప్రశాంతంగా ఉన్న మదిలో ఎదో పెను ఉప్పెన కూసింత క్షణం కోసం గడియారం ప్రకంపన అంతంలేని ఆవేశ , అనాలోచిత క్రియలు ఒక ప్రక్రియగా సాగక ,నడయాడే జీవన క్రియలు -...