Wednesday, 6 September 2017

కవిత నెం : 299 (జీవం -నిర్జీవం)

కవిత నెం : 299
* జీవం -నిర్జీవం *

ఒకవైపు ఆనందం ఆకాశం వైపు
మరోవైపు విషాదం ఆందోళన వైపు

కనులముందు కాంతులే వెదజల్లుతున్న
అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసునా

సాధించానని విజయం ఒకవైపు
నీ విజయం పరాజయమని వెక్కిరింపు మరోవైపు

ఒక్కమాట నీ మనసుకి హాయినిస్తున్నా
కోఠి ప్రశ్నలు నా బుర్రను నలిపేసునా

బంధాలకు దూరమయి గుండెరాయైనా
ఏదో భారం ఎదలో అణుభారమై అన్వేషణ

సంతోషాల సంబరాల కోసం ఏదో సమాలోచన
సంబంధం లేని విషయమేదో దాడిచేసునా

ప్రశాంతంగా ఉన్న మదిలో ఎదో పెను ఉప్పెన
కూసింత క్షణం కోసం గడియారం ప్రకంపన

అంతంలేని ఆవేశ , అనాలోచిత క్రియలు
ఒక ప్రక్రియగా సాగక ,నడయాడే జీవన క్రియలు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
// 06. 09 .2017 //

Related Posts:

  • కవిత నెం 171(ప్రేమా ఏదమ్మా నీ చిరునామా) కవిత నెం :171 ప్రేమా ఏదమ్మా నీ చిరునామా ప్రేమా ఏదమ్మా నీ చిరునామా రెండు మనసులు కలుసుకుంటే వాటి యొక్క కలలు - వెన్నెల కాంతులు కానీ నీవు మిగిల్… Read More
  • కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి ) కవిత నెం :213 ఎదురుచూపుల సంక్రాంతి  ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని  ఎంతమంది అమ్మా ,న… Read More
  • కవిత నెం 248 ( ఒక చిన్న మాట) కవిత నెం : 248 మాట మాట ఒక చిన్న మాట  మనసుని హత్తుకున్న మాట  మౌనంలోన దాగి ఉన్న మాట  గొంతు గ్రంథిలో తిరుగుతున్న మాట  గుప్పెడంత గు… Read More
  • కవిత నెం164(రక్షా బంధన్) కవిత నెం :164 రక్షా బంధన్ - రక్త సంబంధం  అన్నా చెల్లెళ్లకి  అక్కా తమ్ముళ్ళకి  వారి మధ్య ఉన్న ప్రేమకి  ఒకరంటే ఒకరికి  వెంట… Read More
  • కవిత నెం 201(అప్పుల తిప్పలు) కవిత నెం :201 'అప్పుల తిప్పలు '' అప్పుల తిప్పలు  ఇవి ఎవ్వరికే చెప్పుడు  ఆదియందు అందంగా  రాను రాను భారంగా  మన ఆలోచనలను ఘోరంగా&n… Read More

0 comments:

Post a Comment