Tuesday, 12 September 2017

కవిత నెం :300//భగ్న ప్రేమ //

కవిత నెం :300

//భగ్న ప్రేమ //

నిలుచున్నా నీ నీడల్లో నీకోసం
నిలుచున్నా నీ తలపుల్లో నీ కోసం
మబ్బులలో విహరిస్తున్నా నా జాబిలి కోసం
నీరులా ప్రవహిస్తున్నా నీ ఒడి కోసం

నాలో నేనే అన్వేషణ - నీకై నీకై ఆరాధన
నీ ప్రేమ చిగురు పొందితే చాలదా
నీ   పెదవంచున   పేరులా మారితే చాలదా ఓ ప్రియా

తపిస్తున్నా ఆ దేవుణ్ణే నీ కోసం
పూజిస్తున్నా ఆ రాధనే నా దేవి కోసం
బ్రతికేస్తున్నా నిర్జీవమై నీ ప్రేమ  కోసం
భరిస్తున్నా ఈ జన్మనే నీ ప్రేమ కోసం

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు



Related Posts:

  • కవిత నెం72:బాల్యం కవిత నెం :72 బాల్యం అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం అనుభూతుల పుస్తకం - అరు… Read More
  • కవిత నెం69:నా చెలికత్తె కవిత నెం :69 నా చెలికత్తె  ********************** నా జతవు నీవు ,నా చెలికత్తెవు నీవు  నా తనువు నీవు ,నా తారామణి నీవు  నా ఎదపై వాలిన ప… Read More
  • కవిత నెం70:అంత్యాక్షరి కవిత నెం :70 అంత్యాక్షరి  *************************** అందరినీ అలరించే సరిగమ లహరి  మెదడుకు పదునుపెట్టే సంగీత కచేరి గాత్రాలకు పని చెప్పే గా… Read More
  • కవిత నెం71:వెన్నెలమ్మ ఒడిలో కవిత నెం :71 వెన్నెలమ్మ ఒడిలో *********************************** జామురాత్రి  నీడలో ,జాబిలమ్మ జోలలతో వెండిమబ్బుల కాంతులలో ,నీలిరంగు వెన్నెలలో ఆ… Read More
  • కవిత నెం73:బాల్య సొగసులు కవిత నెం :73 బాల్య సొగసులు  : (శ్రీ పద్మ ) ************************************ అమ్మపొత్తిళ్ళలో  ముద్దుగా మురిసిన బాల్యం నాన్న గ… Read More

0 comments:

Post a Comment