Monday, 1 January 2018

కవిత నెం : 315 (ధన దాసోహం)

కవిత నెం : 315

*ధన దాసోహం *

డబ్బుకు లోబడకు ఓ మనిషి
నీ సర్వం కోల్పోకు మరమనిషి

డాబుకు పోబోకు ఓ మనిషి
నీ దారిని మరువకు మరమనిషి

డబ్బును ప్రేమించకు ఓ మనిషి
కపటప్రేమను పొందకు మరమనిషి

డబ్బంటే ఇష్టం వద్దు ఓ మనిషి
నీ ఆప్తులను విడువవద్దు మరమనిషి

డబ్బంటే మోజెందుకు ఓ మనిషి
నువ్వు మనిషివన్నదే గుర్తురాదు మరమనిషి

డబ్బుతో ఆడవద్దు ఓ మనిషి
నిన్ను బొమ్మలాగా మిగులుస్తాది మరమనిషి

డబ్బుతో వెర్రవీగకు ఓ మనిషి
నిన్ను వెర్రివాడిని చేస్తుంది మరమనిషి

డబ్బుకోసం అర్రులు చాచకు ఓ మనిషి
నీ ఆర్తనాదాలు ఎవ్వరూ వినరు మరమనిషి

డబ్బంటే ఆశ వద్దు ఓ మనిషి
నీ ఆశయం అదృశ్యమే మరమనిషి
 

Related Posts:

  • కవిత నెం47:వరకట్నం కవిత నెం : 47//వరకట్నం // వరకట్నం ........  ఇది వధువు తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యమైతే  వరుడికి మాత్రం అంటుకున్న దురహంకారం  జీవం పోస… Read More
  • కవిత నెం 46:భాద పడే భావం కవిత నెం :46 భాద పడే భావం  *********************** ఏం బాధరో ఇది పొంగుతున్నది  ఏం బాధరో ఇది ఉబుకుతున్నది  ఏం బాధరో ఇది ఆగకున్నది … Read More
  • కవిత నెం 45:బుడుగు కవిత నెం : 45 //బుడుగు // బుడుగోడు వచ్చాడు బుడుగు  వాడు మన బాపు గారి ''బుడుగు'' వాడు మన రమణి గారి ''బుడుగు '' అల్లరి చేస్తాడు ''బుడుగు''  … Read More
  • కవిత నెం49:శక్తి స్వరూపిణి కవిత నెం :49 శక్తి స్వరూపిణి  ***************** అంబపరమేశ్వరి  ,అఖిలాండేశ్వరి ,ఆదిపరాశక్తివే  శ్రీ భువనేశ్వరి , రాజ రాజేశ్వరి ,బాలత్ర… Read More
  • కవిత నెం48:నేను మనిషినా కవిత నెం :48 నేను మనిషినా జవాబుచెప్పగలను కాని ప్రశ్నించలేను ప్రేమించగలను కాని ద్వేషించలేను బ్రతిమాలగలను కాని కోపించలేను సహాయం చేయగలను కాని అర్దించ… Read More

0 comments:

Post a Comment