Tuesday, 23 January 2018

కవిత నెం : 317 (పసిడి కిరణాలు)

కవిత నెం : 317

* పసిడి కిరణాలు *
ముద్దు ముద్దు పిల్లలు
ముత్యమల్లె ఉందురు
ఆ పాల బుగ్గలు
లేలేత మొగ్గలు
పసి బోసి నవ్వులు
పసిడి కాంతి మెరుపులు
అమాయకపు చూపులు
అల్లరల్లరి చేస్తురు
అచ్చమైన పాత్రలు
స్వచ్ఛమైన శ్రోతలు
చిట్టి పొట్టి చేతులు
చిన్ని కిట్టయ్య చేష్టలు
బొద్దు బొద్దు సొగసులు
బుంగమూతి పెడుతురు
మల్లెలాంటి బాలలు
మాటలెన్నో చెబుదురు
అందమైన ఆటలు
అంతరంగ బాటలు
కీచు కీచు కేరింతలు
కింద మీద తుళ్లింతలు
బోలెడన్ని ఆశీస్సులు
భవిష్యత్తు ఉషస్సులు
ఏవో ఏవో తేజస్సులు
ఈ చిన్నారుల రూపాలు
ఎన్నో మధురిమలు
మృదువైన క్షణాలు !!!

-




Related Posts:

  • కవిత నెం 268:సొంత గూటి బంధాలు కవిత నెం  : 268 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :3 * సొంత గూటి బంధాలు * పొద్దున్నే లేవగానే శుభోదయం , శుభదినం అంటూ అందరినీ పలకరిస్తావ… Read More
  • కవిత నెం265 :* భార్య బాదితులం * కవిత నెం  : 265 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :1 * భార్య బాదితులం * (హాస్య కవిత - సరదాకు మాత్రమే) భార్య బాదితులం మేం భార్య బాదితులం ప… Read More
  • కవిత నెం266:అది చాలు కవిత నెం :266 *అది చాలు* కన్నులతో పలకరిస్తే పులకరించిపోతావు   కలలోన కిన్నెరవై వీక్షించిపోతావు నా మాటల మృదులతకు మురిసిపోతుంటావు నా సాంగత్య… Read More
  • కవిత నెం264:* జీవన పోరాటం * కవిత నెం :264 *జీవన పోరాటం * పొద్దుగాడ లేస్తూనే పొట్టకూటి కోసం ఎన్నో పనులు మరెన్నో బాధ్యతలు గీ రోజు  మంచిగా గడిస్తే చాలు గీ  దినం మనం బత… Read More
  • కవిత నెం267:భవిష్యత్తు ప్రణాళికలు కవిత నెం :267 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :2 *భవిష్యత్తు ప్రణాళికలు * నిశ్శబ్దంగా మౌనం  సంకోచంలో మనసు  నన్ను నాలోనే కుదిపేసే… Read More

1 comments: