Thursday, 28 June 2018

కవిత నెం :322(నా జ్ఞాపకం)

కవిత నెం :322 * నా జ్ఞాపకం * పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేస్తుంటే ఆ పేజీల మాటున ఒక ఫోటో (చిత్రం) అమాంతం గాలికి ఎగిరి నా ఎదపై వచ్చి వాలింది దాన్ని తిప్పి చూస్తే నీ రూపం ఆ రూపం ఎప్పటికైనా అపురూపమే అది చూసిన నేను కాసేపు విస్మయంలో మరికాసేపు ఆనంద క్షణాల ఊడలలో నెమరువేసుకుంటున్నా నీ జ్ఞాపకాల వలపులనీ నిగ్రహించుకుంటూ నేటి నేనున్న పరిస్థితినీ అవి ఎలా ఉన్నాయంటే సుమీ ! కొన్ని కుసుమాల పరిమాళాల గంధంలా కొన్ని వెన్నెల కాంతుల ఆమని గ్రంధంలా ఎండమావుల వర్షపు నీటి చినుకుల్లా ఎడారిదారుల మధ్య ఇసుకతుఫానులా ఎప్పుడో చెప్పుకున్న సంగతులు జ్ఞాపకం నా ఎదురుగా నీవున్నట్టే...

Saturday, 2 June 2018

కవిత నెం :321(మౌనం చెప్పే మాట

కవిత నెం :321 * మౌనం చెప్పే మాట * మన చుట్టూ ఉన్న వారి నడవడి సక్రమంగా లేనప్పుడు వ్యంగంలో వక్రమార్గంలో పోతున్నప్పుడు మన మనసు స్పందన అందంగా లేనప్పుడు కళావిహీనమైన మనుషుల మధ్య చిన్ని స్థానం స్నేహానికి నోచుకోనప్పుడు అప్రశాంతని అద్దం ముందుంచి ప్రశాంతమైన చిరునవ్వుని చిందించ లేదు ఎందుకో నచ్చవు కొన్ని మనసుకి మనమెంత నచ్చ చెబుదామనుకున్నా తన సేచ్ఛను తను నిర్మించుకునే సౌలభ్యంలో,లాబోపేక్షణ కోరుకోలేదు కూసింత కాలక్షేపం కోసం అశాశ్వతమైన ఈ జీవన పయనంలో మరికాసేపు ఏదో కాలయాపన కొనసాగిస్తూ సమూహాలు నిర్మించుకునివాటి మధ్యే గిరిగీసుకుని ఉండే కౌరవులని చూస్తుంటే ఈ మనసు అభిమన్యుడిలా...