Thursday, 28 June 2018

కవిత నెం :322(నా జ్ఞాపకం)

కవిత నెం :322
* నా జ్ఞాపకం *

పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేస్తుంటే
ఆ పేజీల మాటున ఒక ఫోటో (చిత్రం)
అమాంతం గాలికి ఎగిరి
నా ఎదపై వచ్చి వాలింది

దాన్ని తిప్పి చూస్తే నీ రూపం
ఆ రూపం ఎప్పటికైనా అపురూపమే
అది చూసిన నేను కాసేపు విస్మయంలో
మరికాసేపు ఆనంద క్షణాల ఊడలలో
నెమరువేసుకుంటున్నా నీ జ్ఞాపకాల వలపులనీ
నిగ్రహించుకుంటూ నేటి నేనున్న పరిస్థితినీ

అవి ఎలా ఉన్నాయంటే సుమీ !
కొన్ని కుసుమాల పరిమాళాల గంధంలా
కొన్ని వెన్నెల కాంతుల ఆమని గ్రంధంలా
ఎండమావుల వర్షపు నీటి చినుకుల్లా
ఎడారిదారుల మధ్య ఇసుకతుఫానులా
ఎప్పుడో చెప్పుకున్న సంగతులు జ్ఞాపకం
నా ఎదురుగా నీవున్నట్టే కల ఓ జ్ఞాపకం
నీ అడుగుల గుర్తులను వెంటాడిన జ్ఞాపకం
నీ ఊపిరి శబ్దాలను కొలిచిన జ్ఞాపకం

ఇన్ని రోజులు ఏమయ్యావు
ఎందుకిలా ఈ పుస్తకంలో దాక్కున్నావు
నిన్ను విడిచిన నేను నిన్ను మరిచిపోవాలనా
నిన్ను మరిచానో లేదో అని తొంగి చూడాలనా
ప్రణయ విరహంతో పావులమయిన మనము
జీవన ప్రయాణంలో రెండు నావలమయ్యాము

చూసావా నిన్ను చెలీ అనాలా ఇది కలీ అనాలా
తెలియనే తెలియట్లేదు ఇన్నాళ్ల తర్వాత
నీతో గడిపిన ప్రతీ క్షణాలన్నీ
ఒక్కసారిగా నా ముందు ఫ్లాష్ బ్యాక్ రింగ్ లా
నువ్వు నాతో పలికిన ప్రతీ మాటలన్నీ
నా చెవులలో ఏవో వేద మంత్రాలుగా
అల్లరి చేద్దామని వచ్చావా ?
నన్ను హత్తుకుని ఏడుద్దామని వచ్చావా?

నిన్ను చూడగానే మరీ
గుండెలోతుల్లోంచి భావాలు
ఊటబావిలోనుంచి ఊరుతున్నట్టుగా
ఒక్కసారిగా వెనక్కి తగ్గిన సముద్రపు అల
ఎంతో వేగంతో ముందుకు విరుచుకుపడ్డట్టుగా
నాలో తుఫాన్ ని సృష్టించింది నీ జ్ఞాపకం
నన్ను నేనే మై మరచిపోయేంత జ్ఞాపకం

ఎన్ని జ్ఞాపకాలు నా మదిలో ఉన్నా
నాతో నీవున్నావనేదే అతి పెద్ద జ్ఞాపకం
నిన్ను ప్రేమించినా ,నిన్ను విడిచినా
ఎప్పటికీ నువ్వంటే నాకు ఏదో వ్యాపకం












Related Posts:

  • కవిత నెం62(భూమి పుత్రుడు ) కవిత నెం :62 భూమి పుత్రుడు  ******************************************* ఆరుకాలాలలో అన్నం పెట్టగలిగేది ఒక్క రైతు మాత్రమే  నేడు అందరి అవసరా… Read More
  • కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం) కవిత నెం :29 ***నీ ఓటే ఒక ఆయుధం*** చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి నీ ఓటే ఒక ఆయుధం  //2// నీ గుండ… Read More
  • కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా ) కవిత నెం :44  దేవుడా ....... నీవెక్కడా  ************************* అందకుండా ఉండువాడా దేవుడా అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా ఏడ నీవు దాగున్నావ… Read More
  • కవిత నెం41(ఆకాశం) కవిత నెం :41// ఆకాశం // ఆకాశం ............................. చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు భాదలో ఉన్నా , ఆనందం… Read More
  • కవిత నెం37(తొలకరి జల్లు) కవిత నెం : 37 తొలకరి జల్లుల తిమ్మిరితనం  మేలుకుంటుంది తుంటరితనం ఆడుకుంటుంది చిలిపితనం  అలుపెరుగదు అల్లరితనం  చిన్నపిల్లలకు కేరింతతనం… Read More

0 comments:

Post a Comment