Monday, 2 July 2018

కవిత నెం :323(ప్రియ మధనం)

కవిత నెం :323
*ప్రియ మధనం *

పిలిస్తే పలుకుతావు
పలకరించే పిలుపునివ్వవు

అందుకోమని చేయినిస్తావు
నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు

ముద్దమందారంలా మెరిసిపోతావు
చూడబోతే ఇంతలోనే ముడుచుకుపోతావు

అందరాని సౌందర్యం నీది కాదు కదా !
వందిలించుకోలేని ఒక వలపు సరదా

తుమ్మెదలా చుట్టూతిరుగుతుంటావు
తుంటరిగా ''హైడ్ & సీక్ '' ఆడుతుంటావు

మధురమైన అధరాల మధువునివ్వరాదా
తనివితీరా నీ తనువు వీణని మీటనివ్వరాదా

నీ మనసొక మల్లెతీగ పందిరిరాధా
ఆ తీగల్లోనా చిక్కుకున్న ప్రాణం నాది రాధా

మరణమైనా శరణమే నీ పరువాల ఊడలతో
చిన్న ధైర్యమైనా చేయకనెటుల నీ ప్రణయాల ఊసులతో ...


Related Posts:

  • కవిత నెం 230 :కన్నీరు కవిత నెం : 230 ''కన్నీరు '' కంటి నుండి వచ్చును 'కన్నీరు'  మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు  ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు ' ఉప్పెనగా మారితే అద… Read More
  • కవిత నెం 233 :చదువుల బరువులు కవిత నెం  :233 *** చదువుల బరువులు **** చిట్టి చిట్టి చేతులకి బారెడు బాధ్యతలు  బుడి బుడి నడకలకి ఈడ్చలేని బ్యాగుల మోతలు  ఏం న… Read More
  • కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా కవిత నెం  :235  * నీతోనే ఉంటా నమ్మవా * నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ అందుకే నాకు నిద్రలేని ఈ రేయి నా కనురెప్పపై కొలువున్నావా చెలీ … Read More
  • మినీ కధ 1 :ఎలుకమ్మ ర్యాగింగ్ మినీ కధ  ** ఎలుకమ్మ ర్యాగింగ్ *** మా ఇంటి అలమరలో ఉంది ఒక ఎలుక  ఎప్పటి నుంచో వేసింది పాగ  దొరకకుండా తిరుగుతుంటాది బాగా  ఓ అల్లరి … Read More
  • కవిత నెం 229 :ఎందుకే చెలీ! కవిత నెం :229 ఎందుకే చెలీ ఏమిటే హృదీ చేస్తుంది  అలజడీ ఉండదా మదీ నా జత కూడి తెలియని తొందరేదో పడి ఆగలేని ఆవేశమూ అర్ధమవ్వని ఆక్రోశమూ నీలో నువ్వే… Read More

0 comments:

Post a Comment