Monday, 16 July 2018

328(నా దేశం -ఒక సందేశం )

కవిత నెం :328

పేరు : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 
శీర్షిక : నా దేశం -ఒక సందేశం
కవిత : 1
సంక్లిప్త చిరునామా :
బీరంగూడ ,హైదరాబాద్ 

ఫోన్ .నెం : 9705793187
హామీ పత్రం : కేవలం ఆగస్టు -15 కవితా సంకలనం కోసం రాసినది 
మరియు ఎటువంటి పత్రికలకు పంపబడలేదు

నా దేశం ఒక భగవద్గీత
నా దేశం అగ్నిపుణీత సీత

నా దేశం ఎగిరే భావుట
నా దేశం నిండుగుండే పంట

నా దేశం త్యాగ ధనుల తోట
నా దేశం సంస్కృతి -సాంప్రదాయాల కోట

నా దేశం సర్వమత సమ్మేళనమట
నా దేశం శాంతి -అహింసల చిహ్నమట

నా దేశం మాతృ గర్భ కోవెల
నా దేశం సమతా మమతల వెన్నెల

నా దేశం భారత వీరుల గడ్డ
నా దేశం భావి పౌరుల అడ్డా

నా దేశం స్వేచ్చా పావురం
నా దేశం హిమశైల గోపురం

నా దేశం పవిత్ర భారతదేశం
నా దేశం నాకు గర్వకారణం

నా దేశం తరతరాలకు  ఆదర్శం 
నా దేశం ఒక స్వచ్ఛమైన  సందేశం 



Related Posts:

  • కవిత నెం97:ఒక మైలు రాయిని నేను కవిత నెం :97 ఒక మైలు రాయిని నేను ****************** ఒక మైలు రాయిని నేను  నా  ప్రయాణంలో కాని కదిలే మైలు రాయిని నేను నా ఎదురుబాటలో ఇ… Read More
  • కవిత నెం 101:నాకలం నడుస్తుంది కవిత నెం :101 నాకలం నడుస్తుంది అభ్యదయ భావాల వైపు నాకలం నడుస్తుంది ఆశల అడుగుల వైపు నాకలం నడుస్తుంది రమణీయ సాహిత్యం వైపు నాకలం నడుస్తుంది స్వరనీయమైన క… Read More
  • కవిత నెం 99:హాయైనా జీవితం కవిత నెం :99 హాయైనా జీవితం అందరికీ అద్బుతం జీవించటం అవసరం జననం మరణం normal  అందివచ్చే ఆనందం దరిచేరగా చెంతవుండే కన్నీరు తడి అవునుగా కష్టాల… Read More
  • కవిత నెం100:మందుగ్లాసు కవిత నెం :100 ఒక మందుగ్లాసు పిలుస్తోంది మత్తు ఇక్కడే ఉందని చెబుతోంది. కిలాడిహృదయం ఏమంటుంది కొంటెగా దాన్ని పట్టమంటుంది మరి మందుగ్లాసు పిలుస్తోంది … Read More
  • కవిత నెం98:ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ కవిత నెం :98 @ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ @ ఓ జీసస్ - నీకు హ్యాపీ క్రిస్మస్ శుబోదయమున ఆరాధన నుంచి సాయం సమయమున ప్రార్దన దాకా హాయిగా అనుభవిం… Read More

0 comments:

Post a Comment