Friday, 13 July 2018

కవిత నెం :327(యాదాద్రి -శిల్ప కళా వైభవం )

కవిత నెం :327

''యాదాద్రి -శిల్ప కళా వైభవం ''

నల్లరాతి శిలల నుంచి జీవం పోసిన  అద్భుత కళాఖండాలు
యాదగిరీశుడి సన్నిధిలో కొలువుదీరే సౌందర్య రూపాలు

రాజుల కాలాన్ని తలపించే మంటపాలు ,గోపురాలు
అద్భుతాలను ఆవిష్కరించే శిల్పుల కళా నైపుణ్యాలు

శైవాగమశాస్త్రానుసారం జరిగే శివాలయ నిర్మాణాలు
సాలహారంలో శక్తిపీఠాలు , ద్వాదశ జ్యోతిర్లింగాలు

కాకతీయుల శిల్పకళా ఒరవడికి నిలచే నమూనాలు
పల్లవుల ,చోళుల కాలంలో విరాజిల్లిన శిల్పకళా వైభవాలు

అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు
సర్వాంగ సుందరంగా నిర్మింపబడే నవగ్రహ ఆలయాలు

కనువిందు చేస్తున్న ఆధ్యాత్మిక అద్భుత కళా సంపదలు
ఆధ్యాత్మిక రాజధానిగా రూపు దిద్దుకుంటున్న రూపు రేఖలు

కృష్ణ శిలల నిర్మాణాలు , ప్రాకార మండపాలు
మధ గజాల బొమ్మల మధ్య శాసించే అందమైన బాల పాద స్తంబాలు
గజరాజులు -సింహాలు ,లతలు -పద్మాలతో మించిన కళాఖండాలు 

తంజావూరు శిల్ప సౌందర్యాన్ని తలపించే ఆధునాతన సోయగాలు
ఆగమశాస్త్రోక్తంగా సాగుతున్న ప్రత్యేక నిర్మాణ కౌశలాలు
అబ్బురపరిచే ,ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక అద్భుతాలు

నిష్టాతులైన శిల్పుల చేతులో ప్రాణం పోసుకుంటున్న శిల్పాలు
ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాలు

యాదాద్రి ఆలయ విస్తరణకు సిద్దమవుతున్న శిల్పాలు
వేగంగా సాగుతున్న యాదాద్రి పునర్నిర్మాణ వైభవాలు
ఉగ్ర నరసింహుని ఆనందింపచేసే ఆలయ సౌధాలు

''ఉభయ కళానిధి ''వారి యాదాద్రి కవి సమ్మేళన ఆహ్వానాలు
వెయ్యి నూట పదహారు కవులతో కవితాక్షర నీరాజనాలు
బృహత్తర కార్యక్రమ నిర్వహణకు శ్రీ శిఖా గణేష్ గారికి నా అభినందనలు
అదృష్టమే సుమీ ఈ వేడుకలో మన కవితల పఠనాలు

(OR )

ఏమని చెప్పుడు ఓ నరసింహ నా సౌభాగ్యము
ఉగ్ర నరసింహుని ప్రశాంత నయనాలతో
కవి సమ్మేళనపు ఆనంద వీక్షణాలు చూడ !


- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్ , 9705793187






















Related Posts:

  • కవిత నెం :334(నీ -నా లు) కవిత నెం :334 నీ -నా లు నేను నీకు ముఖ్యమనుకుంటే నీవు కూడా నాకు ముఖ్యమే నా అవసరం నీకుంది అనుకుంటే సహాయానికి నేను సిద్ధమే నీతో ప్రవర్తన బాగుండాలనుకు… Read More
  • కవిత నెం :339(జబ్బు మనుషులు) కవిత నెం :339 కవిత పేరు : జబ్బు మనుషులు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు విచిత్రదోరణిలోనే బ్రతికేస… Read More
  • కవిత నెం : 337(కరోనా ) కవిత నెం : 337 కరోనా  ఈ కరోనా ప్రభావంతో ఒక మనిషి ఆలోచనలు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు ప్రపంచం మొత్తం ఒకేసారి తక్కువ సమయంలో వారి గతం నుంచి … Read More
  • కవిత నెం :338(మట్టి మనిషి) "మట్టి మనిషి " మట్టిలో పుట్టాం  మట్టిలో ఆడుతూ పెరిగాం  మట్టితో సహవాసం సాగిస్తున్నాం  మనం తినే తిండి మట్టిలోనుంచే  మనం కట్టే… Read More
  • కవిత నెం :333(తెలంగాణ వేమన) కవిత నెం :333 కవిత శీర్షిక : తెలంగాణ వేమన ''వినుడి  మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరకుప్ప కవికుప్ప కనకమప్ప'' ఈ యొక్క మకుటం తలచిన చాలు జ్ఞప్… Read More

0 comments:

Post a Comment