Thursday, 2 July 2020

341(లోకంలో ఆడపిల్ల)

కవిత నెం  :341
కవితా శీర్షిక : లోకంలో ఆడపిల్ల

ప్రతీ రోజు పేపర్లో
ప్రతీ రోజు వార్తల్లో
ఎక్కడో ఒకచోట
కనిపించే అమానుషం
వినిపించే ఆర్తనాదం

ఏ తల్లి కడుపు ఆవేదనో
ఏ కాముకుడి విషపు క్రోరకో
ఏ క్రూరత్వం కన్నెర్ర చేసెనో

చూస్తుంటే నిస్సాయత
నీడలా నడుస్తుంటే
చూస్తుంటే వారి ఆశలు
నిప్పుల్లో దహిస్తుంటే

ఎలా ఎలా జరుగుచున్నవి
మానవత్వం లేని ''మాన భంగాలు ''
ఎలా ఎలా మార్చేస్తున్నవి
హృదయం లేని మృగ '' మగ రాజు '' లని

ఛి వారి బ్రతుకు ఎందుకు ?
వావి వారసలేని కుక్కలవలే
ఆడదంటే ఎగబడుతూ
తన పుట్టుక ఒక ఆడపేగు అని తెలిసి
మరచే ఆ దౌర్భాగ్యం ఎందుకు ?

ఆనాడు సీత ,ద్రౌపది మాతల గెలుపు
ఈనాడు పుడమితల్లుల రోదింపు
దేశం ఎదుగుతూ ఉంది
మగవాడి బుద్ది మారుతూ ఉంది

దినదినగండం స్త్రీ జీవితం
దారుణ మారణ కాండం స్త్రీ భవితం
రక్షక భటులు ఉన్న ఈ రాష్ట్రంలో
పడతిశీలాన్ని భుజించే భక్షకులు
ఎవ్వరు రావాలి వీరికి వెలుగు నివ్వటానికి
మరెవ్వరు రావాలి ఆడపడుచుల సౌభాగ్యం నిలుపటానికి



Related Posts:

  • కవిత నెం146:బంధాలు కవిత నెం :146 ఏమిటి ఈ బంధాలు  ఏమిటి ఈ బావుకతలశ్రావ్యాలు  ఏమిటి ఈ నేస్తాలు  ఏమిటి ఈ పరిచయాలు  ఏమిటి ఈ ఆనంద క్షణాలు  ఏమ… Read More
  • కవిత నెం149:చరఖా కవిత నెం :149 చరఖా భారత స్వాతంత్రోద్యమంలో  మేటి రధసారధి మువ్వన్నెల జెండాలో రూపుదిద్దబడిన తొలిచిహ్నం చేనేత కళాకారులకు వారసత్వపు కల్పవృక్షం… Read More
  • కవిత నెం148:సీతాకోక చిలుక కవిత నెం :148 సీతాకోక చిలుక  వన్నె చిన్నెలున్న సీతాకోకాచిలుక రెక్కలకు రంగులనే కల్గినావంట స్వేచ్చకు రెక్కలు తొడిగే ప్రాణివి నీవు చిరునవ్వుల్ని … Read More
  • కవిత నెం147:ఎవరు నీవు కవిత నెం :147 *ఎవరు నీవు * నిన్ను నేను విడువగలనా నీ చెలిమిని నేను మరువగలనా నా బాధలో ఆనందం నీవు  నా కష్టంలో సుఖం నీవు  నా మనసులో హాయి న… Read More
  • కవిత నెం145:నన్ను మార్చిన నీవు కవిత నెం :145 *నన్ను మార్చిన నీవు * కదలని బండరాయిలా ఉన్నా ఇన్నాళ్ళు  నన్ను కదిలే శిల్పాని గా చేసావు  గాలికి ఊగని గోడగా  నిలుచున్నా … Read More

0 comments:

Post a Comment