Wednesday, 19 August 2020

చిరంజీవి

కొణిదెల శివశంకరవర ప్రసాదు 
"చిరంజీవి" సినీ రంగం లో జన్మించాడు 
పునాదిరాళ్లతో పునాది నిర్మించుకుని 
స్వయంకృషితో స్వయంగా ఎదిగినాడు 
కోట్లాదిమంది హృదయాల సంపన్నుడు 
తన అందం, అభినయంతో విజేతగా నిలిచాడు  
అభిమానుల కోసం దిగివచ్చిన "జగదేకవీరుడు "
నవతరానికి వారధిగా,ఆదర్శనీయమైన నటుడు 
అందరికీ అందేవాడు ఈ అందరివాడు 
రక్తదానంతో ప్రాణాలను పోసే సంజీవుడు 
వెండితెరలో వెలుగొందే "మగ మహారాజు "
బాసులకు బాస్, అయన చూపులో ఏదో గ్రేసు 
"చిరు "పేరులో ఏదో ప్రభంజనం 
"చిరు " ని చూసి ఎదిగాం మేమందరం 
స్టార్స్ ఎందరు ఉన్నా అయన స్థానం వేరు 
అందుకే "మెగాస్టార్ " పద్మభూషణ్ " బిరుదులకు ఆద్యుడు 
హామీపత్రం : చిరంజీవి గారిపై అభిమానంతో స్వయంగా నేను రాసినది మాత్రమే ప్రచురణకు తీసుకొనగలరు 

గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ 
హైదరాబాద్ 
9705793187

Related Posts:

  • కవిత నెం :293(మనిషి భాగవతం) కవిత నెం :293 *మనిషి భాగవతం  * ఒకరికి తెలిసిందే ధర్మం మరొకరు అనుకునేదే న్యాయం ఇంకొకరు చెప్తారు వేదం మరొకరు చూపిస్తారు బేధం ఒకరికొరకే నీత… Read More
  • కవిత నెం : 297 (మన స్వాతంత్రం) కవిత నెం : 297 *మన స్వాతంత్రం * తరాలు మారినా ,యుగాలు మారినా ఓ భావి భారత పౌరుల్లారా మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు ఇంకా పుంకాలు పుంకాలుగా మనమేమో… Read More
  • కవిత నెం :289(నవ్వంటే) కవిత నెం :289 *నవ్వంటే * నవ్వంటే నాకిష్టం నవ్వుతూ ఉండాలన్నది నా మనోగతం నవ్వుతూ కనిపించే వాళ్లంటే ఒక సంతోషం నవ్వుతూ పలకరించే వాళ్లంటే ఒక గౌరవం మాట్ల… Read More
  • కవిత నెం :292(మనసు వాంచ) కవిత నెం :292 *మనసు వాంచ * మనసారా ఉండాలనీ మనసు మాట పంచాలనీ మనసు కిటికీ తెరవాలనీ అనుకుంటూ చలిస్తుంది ఆ మనసు ప్రతి స్పందనకై ఎదురుచూస్తూ తేనెపూసే మాటల… Read More
  • కవిత నెం : 298(కోరిక) కవిత నెం : 298 * కోరిక * మొగ్గలా మొలుస్తుంది పువ్వులా విచ్చుకుంటుంది ఆశలా పుడుతుంది గమ్యం కోసం పరిగెడుతుంది గుండెలోతుల్లో దిగులుగా , మెదడు మలుపుల్లో… Read More

0 comments:

Post a Comment