Sunday, 21 May 2023

కవిత నెం 352

జనమంతా మనమే అనుకుంటాం
అంతా మనవారే అని భావిస్తాం
నిర్మలమైన మనస్సుతో 
నిస్వార్ధమైన హృదయంతో
ఆత్మీయటను పంచనీకి ఎదురు వెళ్తాం 
ప్రేమ చూపెడుతూ ఉంటాం
మన ప్రేమను పంచుతూ ఉంటాం
కాని
ఏదో స్వార్ధపు పొరలను కప్పుకుని
ఏవేవో లెక్కలను పెట్టుకుని
నమ్మిన మనల్నే మోసం చేస్తారు కొందరు
మనముందు తీయను మాటలను చెబుతూ
కనిపించని ద్వేషాన్ని మనసులో పెంచుకుంటూ
 
అంతా మంచే అని మనమనుకుంటుంటే
అదే మన పిచ్చి అని తేల్చి పడేస్తారు
నిజాయితీ గల స్నేహం వీరికి వద్దు
కాలమెట్లా ఉంటే అట్లానే వీరు
గోతులు తీసే స్నేహాలే వీరికి ముద్దు
కులతో నిలచే బంధాలే వీరికి ముందు
మనమే అర్ధం చేసుకోవాలి
మనల్నే మనం మార్చుకోవాలి 
ఎన్ని సార్లని ,ఎన్నెని సార్లని 
మోసపోతావు మిత్రమా
నిన్ను కాదన్నా ,నీతో స్నేహం కాదంటున్నా
అవలీలగా చెప్పకుండానే బేధం చూపిస్తుంటే 
అంతా మనవారే అని
భ్రమలో పడి కాలయాపవ చేయుట ఎందుకు?
కష్టమైనా ,నష్టమైనా నీకే నువ్వు
కూటికైనా ,కాటికైనా కడదాకా నువ్వే
ఈ సమాజపు తీరు మారదు
నిన్ను నువ్వు మార్చుకుని జీవించు
నీ ఆనందాన్ని నీవే అనుభవించు

0 comments:

Post a Comment