Thursday, 11 January 2024

కవిత నెం 353 నా గుండె వెనుక ఇంకొక చప్పుడు నా మాటల్లో మరొక శృతి ఇప్పుడు చుట్టూరా జనంతో కూడిన వాతావరణం నా కళ్లలోకి ప్రవహించెను ఏదో మెరుపు వేగం నా అడుగులు వాటి కదలికల్ని మరిచాయి నా శరీరంలో కదలికలకు లేదు చలనం కాలమంతా ఒకేసారి తిరిగినట్టు ఉన్నది గడియారం కాసేపు స్తంభించి యున్నది నన్ను వీడిన నీడ నా ప్రక్కకు వచ్చినట్టు నేను వదిలిన జ్ఞాపకం నా బుర్రకు తట్టినట్టు నీ కనుసైగలను చూస్తూ ఉండిపోయా నా చెలినేనా అని అయోమయంలో పడిపోయా అమాంతం బిగిసిన పెదవులు మౌనంలోనే కుశల ప్రశ్నలు వేసుకుంటున్నాయి నలుగుతున్న నిశ్శబ్దంలో మౌనం మాటల్ని వెతుక్కోవటం మొదలెట్టింది బాగున్నావా అని అడగాలా? ఏమటిపోయావు అని అడగాలా? కొన్ని సంవత్సరాల తర్వాత నీ రూపాన్ని చూస్తూ పసివాడినయ్యిపోయాను తడిచిన కనులతో స్వాగతం చెప్తున్నాను తనివితీరా పలకరించలేక బరువెక్కిన గుండెతో విలపిస్తున్నాను నీ ప్రశ్నలు కావాలి, నీతో ముచ్చటించాలి ఆ పాత హృదయం పలకాలి నీ స్పర్శ నాకుకావాలి నువ్వేనా నా చెలీ అనీ తెలియాలి

హహహహ

Related Posts:

  • కవిత నెం 165:అంతా ప్రేమమయం కవిత నెం :163 *అంతా ప్రేమమయం*  ప్రేమలేని ప్రక్రుతి ఉండదు  ప్రేమలేని జీవం ఉండదు  ప్రేమలేని సృష్టి ఉండదు  ప్రేమలేని బంధం ఉండదు&… Read More
  • కవిత నెం 162:అందమా .... చంద్రబింభమా కవిత నెం :162 అందమా .... చంద్రబింభమా నన్ను నిద్దురపోనీయక చేసే రూపమా ప్రాణమా ... నా ప్రతి రూపమా నా  ఊపిరిని అందనీయకుండా చేసే పరువమా కావ్యమా ...… Read More
  • కవిత నెం166:ప్రేమా నువ్వు కవిత నెం :164 ప్రేమా నువ్వు  దూరమయ్యావు ప్రేమా నువ్వు -దగ్గరగా ఉంటూ  బారమయ్యావు ప్రేమా నువ్వు - బ్రమ చూపిస్తూ  కలిసియున్నావు ప్రే… Read More
  • కవిత నెం167:వెంటాడే వలపు కవిత నెం :167 *వెంటాడే వలపు * నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది నిదురిస్తే ,నీ రూపం తట్టి లేపుతుంది మేల్కొని వుంటే , నీ తలంపు మై మరపిస్తుంద… Read More
  • కవిత నెం 163:ఒక ఉల్లి కధ కవిత నెం :163 ఒక ఉల్లి కధ ***********************  అనగనగా ఒక ఉల్లి  అవసరం ఇది మనకు డైలీ  వంటలరుచిలో ఇది బుల్లి చెల్లి  ఆరోగ్యాన్… Read More

0 comments:

Post a Comment