Thursday, 11 January 2024

హితమే సన్నిహితం (354)

హితమే సన్నిహితం 

అంతా అంధకారమే కనిపిస్తుంది

అహం నీకు ఆవహిస్తే


ప్రశాంతంగా నీ ఆలోచనలు ఉంటే

సంతోషం సగం బలమై తోడుంటుంది


ఎత్తు పల్లాలు ,ఎండ మావులు 

వస్తుంటాయి ,పోతుంటాయి


దూరంగా భారాన్ని చూసి భయపడితే ఎలా

అసాధ్యమంటూ ఏదీ లేదూ

నీ అంతరాత్మలోకి తొంగిచూసుకుంటూ ఉండు


సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది అంటే

ఎక్కడో నీ గురించే ప్రస్తావన వస్తుంది అంటే

అక్కడే నీ శక్తి ఏమిటో ,యుక్తి ఏమిటో తెలుస్తుంది

విజయం నీ వైపే వేచియుంది.


పిడుగువచ్చినా ,సునామీ వచ్చినా

భయపడని మనిషి

సాటి మనిషితో మాట అనిపించుకోవాలంటే భయపడ్తాడు

కారణం తన ఆత్మ గౌరవం 

సగర్వంగా బ్రతకమని సూచిస్తుంది


నిలదొక్కుకుని బ్రతికితే నిలకడ ఉంటుంది
అలికిడికి అదిరిపడితే అలజడి మొదలౌతుంది

నీ స్థాయి ,స్థానమంటూ మురిసిపోకు
మనమే స్థాయిలో ఉన్నా ,మన ప్రస్థానం మారకూడదు

నిందపడినంత మాత్రాన నిజం మాసిపోదు
అబద్దపు జీవితాలలో పొద్దు వాలిపోదు

ఆశగా మెరిసిపోవాలి ,నిరాశని నీడకీడ్చాలి
కుమిలిబోతూ కృంగిపోరాదు
కూసింత ఒత్తిడికే ఒంగిపోరాదు 
ధైర్యంతో అడుగు ముందుకేసుకుంటూ సాగిపోవాలి

నిన్ను చూసి గొప్పగా మాట్లాడే రోజు రావాలి
నీ విలువ్లను నీకు నువ్వే కాలరాసుకోకు
ఎవ్వరి విలువనూ తగ్గించాలని ప్రయత్నించకు

కాలమే సమాధానమిస్తుంది కాలానుగుణంగా
నిన్ను సమాధాన పరుస్తుంది పదిలంగా 


Related Posts:

  • కవిత నెం : 282(శ్రీ రామ్ ) కవిత నెం : 282 *శ్రీ రామ్ * రామనామము రమనీయమైన కావ్యంరామనామజపం ముక్తికి మోక్షదాయకంమానవజాతికే ఆధర్సనీయం శ్రీరామజన్మంజయహో జయరామ పరందామ శ్రీరామ జయహే ! … Read More
  • కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !) కవిత సంఖ్య :279 కవితా శీర్షిక : వస్తుంది ఉగాది ! తెలుగింటి ముంగిలి లోకి  ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది  స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అ… Read More
  • కవిత నెం 283(నేటి చిన్న తనం) కవిత నెం 283 * నేటి చిన్న తనం * వివేకమో ,అవివేకమో తెలియదు గర్వమో , గారాభమో తెలియదు  కదిలిస్తే చాలు నాగు పాము పాము బుసలు క్షణికంలో మారిపోయే మనసు… Read More
  • కవిత నెం :18 //ఉగాది // కవిత నెం :18 //ఉగాది // వసంతకాలాన విరబూసే చైత్ర మాస సోయగం ''ఉగాది'' ప్రకృతిని పులకరింపచేసే  చైత్ర శుద్ధ పాడ్యమి ''ఉగాది '' మనసుని పలకరించే మళ… Read More
  • కవిత సంఖ్య : 280* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు * కవిత సంఖ్య : 280 * హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు * మావి కొమ్మలు మల్లె రెమ్మలు కోయిలమ్మలు లేలేత చిగురులు వేప పువ్వులు చెఱుకు గడలు బంతి- చేమంతులు పుడమ… Read More

0 comments:

Post a Comment