Sunday, 14 January 2024

మాయ మనిషి(356)

శీర్షిక :మాయ మనిషి
నిజంగా మేడిపండు ఫలమే కాదు
మన జీవితానికి ఉదాహరణగా నిలచే రాశిఫలం
ఎందుకో ఎత్త ఎత్తుకి ఎదుగుతున్న మనిషి
తన బుద్ధిలో మాత్రం మందగిస్తూనే ఉంటాడు
పైకి మాత్రం మేడిపండులా కనపడుతున్నా
తన లోపల మాత్రం కుళ్లుని పెట్టుకుని కంపుకొడతాడు
తన విజయంలో ఆనందాన్ని ఆస్వాదించలేడు
పక్కవాడి ఓటమిలో కళ్లలో విషపు కాంతిని నింపుకుంటాడు
తన ఏడుపుని సైతం దిగమింగుకుని 
పక్కవాడి బాధలో పైశాసికత్వానికి పురుడుపోస్తాడు
ఒకడి మాటల్లో మంచి వినటానికి ఇష్టపడని ఈ మనిషి
జీవిత సలహాలు ఇవ్వటానికి మాత్రం ముందుంటాడు
పైకి మాత్రం పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తూ
తన స్వభావాన్ని సమయం వచ్చినప్పుడు 
రాక్షస గుణాన్ని భయట పెడుతూ ఉంటాడు
ఆశ చావదు చుట్టూ ఎంత ఐశ్వర్యం ఉన్నా
ఏదో స్వార్థం ,తన మనసుని కమ్మేస్తూ ఉంటుంది
ఎక్కడున్నా కీర్తికోసం ఆరాటపడుతూ ఉంటుంది
అంతా నేనే ఉండాలి , అనే అహం ఆవహించి ఉంటుంది
కుతంత్రాలు తెలిసిన మనిషి కృంగుతూ ఉంటాడు
తను అనుకున్నది సాధించ లేకపోతే
సాటి మనిషిపై నెగ్గలెక్కపోతే
తాను కూడా మనిషే అని మర్చిపోతూ ఉంటాడు
సంతృప్తి లేకుండా , సంతోషాన్ని అనుభవించకుండా



Related Posts:

  • కవిత నెం129:వామ్మో ఆడవాళ్ళు కవిత నెం :129 //వామ్మో ఆడవాళ్ళు // నమ్మొద్దు నమ్మొద్దు ఆడాలని  నమ్మి వెళ్ళవద్దు నువ్వు పోలో మని నచ్చితే చేస్తారు ఫ్రెండ్ షిప్పు  ఆపైన … Read More
  • కవిత నెం132 :వినాయకా కవిత నెం :132 //వినాయకా // ఆది  దేవ నీవయా అభయహస్తం నీదయా జై బోలో గణేషాయా మొట్టమొదటి దీవెన ప్రధమమైన  పండుగ నీ చవితి నేగ వినాయకాయ … Read More
  • కవిత నెం131:ఇంకా ఇంకా అనుకుంటే కవిత నెం :131 ఇంకా ఇంకా అనుకుంటే ఇంకా ఇంకా అనుకుంటే ఏముంటుంది ? ఇంకా ఇంకా అనుకుంటే ఏమి వస్తుంది ? ఆశకి కావాలి ఇంకా ఇంకా అవకాశానికి కావాలి… Read More
  • కవిత పేరు128:గెలుపు -ఓటమి కవిత పేరు : 128//గెలుపు -ఓటమి // ఒక తరుగు ఒక మెరుగు కోసమే ఒక చెడు ఒక మంచి కోసమే ఒక బాధ ఒక ఆనందం కోసమే  ఒక చీకటి ఒక వెలుగు కోసమే ఒక నష్టం ఒ… Read More
  • కవిత నెం130: రక్తం కవిత నెం :130 //రక్తం // ఒకే రంగుతో లోకంలో ఎప్పుడూ ఉండేది తన ప్రవాహంతో మనిషిని బ్రతికిస్తూ ఉండేది  కుల - మత బేదాలకు అతీతమైనది  అందరు ఒ… Read More

0 comments:

Post a Comment