Sunday 14 January 2024

భోగి పండుగ(355)

పచ్చ తోరణాలు
పాడి పంటలు
ముంగిట ముగ్గుళ్లు
సంక్రాంతి గొబ్బిమ్మలు
భోగి పండుగ సందళ్లు

ఈ పండగ అప్పుడూ ఇప్పుడూ ఆ ఆహ్లాదమే వేరు
చిన్నా పెద్దా అంతా వారి వారి ఊళ్లకు చేరి
మూడు రోజులకి సరిపడా కొత్తబట్టలు
పండించిన పంట ఇంటికొచ్చే తరుణం
ప్రొద్దున్నే పొగమంచులోనే
పాత చెక్క సామాన్లు, కట్టెలతో భోగి మంటలు
కష్టాలు -బాధలు అన్నీ ఈ మంటల్లో పోవాలని
కొత్త ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలని
ఆ మంటలవేడి మధ్య నీళ్లు కాచుకుని
వాటితోనే స్నానమాచరించి
చేసిన పిండివంటలతో పూజలు చేసి
అందరూ కలిసి విందు ఆరగించి
సాయంత్రం పసి పిల్లలకు భోగి పళ్లు పోసి
భోగ భాగ్యాలతో ,సిరిసంపదలతో
తులతూగాలని దీవించగా
ముగుస్తుంది మన మొదటి రోజు పండుగ
ఈ భోగి పండుగ

0 comments:

Post a Comment