Sunday 14 January 2024

ఓ ఓటరు మహాశయా! (350)

కవితా శీర్షిక : ఓ ఓటరు మహాశయా!


మన పోరాటం వ్యవస్థ కోసం 

కాని ఒక వ్యక్తి కోసం కాకూడదు.


మన ఆరాటం చెడుని జయించటం కోసం

కాని మంచిని ముంచటం కోసం కాకూడదు.


మన లక్ష్యం అభివృద్ది వైపు కోసం

కాని అధికార పరపతులకోసం కాకూడదు


మనం చేసే యుద్దం ప్రజాహితం కోసం 

కాని మన స్వార్ధ ప్రయోజనాల కోసం కాకూడదు.


మార్పు అనేది మొదలవ్వాలంటే

ముందుగా మనం మారటానికి సిద్దపడాలి

రాజ్యాంగం ఇచ్చిన మన నైతిక హక్కుని

నిజాయితీగా ,నిర్భయంగా 

నీ ''ఓటు '' అనే అయుధంతో కొట్టి చూడు


వాడెవడో ,వీడెవడో అని కాదు

మరో వాడు రావాలన్నా ''ఓటు '' కి తల దించాల్సిందే

తప్పు చేయరాదని భయపడాల్సిందే


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం

ప్రతీ ఓటరూ విచక్షణతో ఆలోచన చేస్తే


వచ్చే ప్రతీ నాయకుడు సుపరిపాలన ఇవ్వటానికే ప్రయత్నిస్తాడు

మనలో సఖ్యతతో కూడిన ఐక్యత ఉండాలి

మన గళం వినిపించటానికి సిద్దంగా ఉండాలి

మన నాయకుల్ని మనమే నడిపించుకోవాలి 

మంచి నాయకుల్ని మనమే గెలిపించుకోవాలి


కాబట్టి 

ఓ ఓటరు మహాశయా !

మన తల రాతలు ఎలా ఉన్నా

మన రాత మన భవిష్యత్తుకై 'ఓటు ' అనే అక్షరంతో 

మనకి మనం రాసుకోవాల్సిందే 

0 comments:

Post a Comment