Tuesday 12 September 2017

కవిత నెం : 301// ప్రేమ యాన్ //

కవిత నెం : 302
// ప్రేమ యాన్ //

నీ వడి వడి పలుకులు నాలో జడి రేపేనే
నా మడి గిడి అంతా సడి ఆయేనే
నా మదిలో ఏదో అలజడిగా మెదిలి
నా గుండెలో గుడిగా నీకై  వెలిసినే

నిన్ను చూసి నా కనులకు అదృష్టమే
నిన్ను తలచి నా స్వప్నం అదృశ్యమే
ఏవేవో మంత్రాలు నాకు వినిపించెనే
నీ పేరు లాగే అవి గాంచెనే
నన్నే నేను మై మరచానే
నిన్నే ఎదలో ధ్యానించానే
నీ చేతిలో శిలలాగ   అగుపించానే
నీ స్పర్శతో నూతనంగా ఉదయించానే

నీ ముద్దుతోటి మరల జన్మించానే
నీ ప్రేమతోటి నేను పులకించానే
నన్ను నే మరచానే
నిన్నే ధ్యానించానే
నా ప్రేయసి నాకై దిగివచ్చావే
నా రాక్షసి నీకై తిరిగొచ్చానే

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు


0 comments:

Post a Comment