Wednesday 6 September 2017

కవిత నెం : 299 (జీవం -నిర్జీవం)

కవిత నెం : 299
* జీవం -నిర్జీవం *

ఒకవైపు ఆనందం ఆకాశం వైపు
మరోవైపు విషాదం ఆందోళన వైపు

కనులముందు కాంతులే వెదజల్లుతున్న
అంధకారం ఆ కాంతి ఛాయలనే కాటేసునా

సాధించానని విజయం ఒకవైపు
నీ విజయం పరాజయమని వెక్కిరింపు మరోవైపు

ఒక్కమాట నీ మనసుకి హాయినిస్తున్నా
కోఠి ప్రశ్నలు నా బుర్రను నలిపేసునా

బంధాలకు దూరమయి గుండెరాయైనా
ఏదో భారం ఎదలో అణుభారమై అన్వేషణ

సంతోషాల సంబరాల కోసం ఏదో సమాలోచన
సంబంధం లేని విషయమేదో దాడిచేసునా

ప్రశాంతంగా ఉన్న మదిలో ఎదో పెను ఉప్పెన
కూసింత క్షణం కోసం గడియారం ప్రకంపన

అంతంలేని ఆవేశ , అనాలోచిత క్రియలు
ఒక ప్రక్రియగా సాగక ,నడయాడే జీవన క్రియలు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
// 06. 09 .2017 //

0 comments:

Post a Comment