Thursday 16 April 2020

కవిత నెం :339(జబ్బు మనుషులు)

కవిత నెం :339

కవిత పేరు : జబ్బు మనుషులు


మనస్ఫూర్తిగా నవ్వలేరు
నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు
వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు
విచిత్రదోరణిలోనే బ్రతికేస్తుఉంటారు
క్రమశిక్షణ లేని విచక్షణ వైరాగ్యులు
క్రమం లేని పరిక్రమించని జీవులు
కోపతాపాలను దాచను లేరు
ప్రేమాభిమానాలను పంచను  లేరు
ఎందుకూ పనికిరాని అనుభవం
ఎవ్వరి సంక నాకటానికి
ఎందుకు ఉపయోగపడిని జ్ఞానం
ఏ విత్తులు సంపాదించటానికి
అందరిలో ఉన్నా ఒంటరిగా వైనం
తలతిక్కపట్టిన తింగరి వ్యక్తిత్వం
కసాయి గుండె కాదు
ప్రాణాలు తీసే పాషాణం కానే కాదు
వీరి తత్వంలో ఎదుటివారిని
సూదిమందులా చంపే మానవ మనోరోగం


0 comments:

Post a Comment