Thursday, 17 March 2022

హోళీ (కవిత నెం 348)

వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక "హోళీ"
సప్త వర్ణాల సొగసులతో సలక్షణమైన పండుగ "హోళీ"
చలికి వీడ్కోలు పలికి , హోళికా దహన కాంతులే "హోళీ"
రాధా కృషుల ప్రేమ గీతాల గాన విభావరి "హోళీ"
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక "హోళీ"
బాధల్ని మరచి , ఆనంద పరవశంలో ఆడే కేళి 
చిన్నా ,పెద్దా అంతా కలిసి సంబరాలతో చేసే సందడే ఈ "హోళీ"
అనురాగం , ఆప్యాయతలతో రంగులు చేసే స్నేహం "హోళీ"
కొత్త బంధాలకు, బాంధవ్యాలను జత చేసే పండుగ "హోళీ"
రాగ ద్వేషాలకు అతీతంగా ఇది రంగులు చేసే "హోళీ"
జగమంతా రంగులమయం
ప్రపంచంలోని రంగులన్నీ కలిసి చేసే కోలాహలం
అన్నీ రంగులు కలిస్తేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసి ఉంటేనే ఈ దేశానికి ఆనందం

Tuesday, 15 March 2022

@@@@

అడుగడుగునా అనుబంధాల మూటలు
ఆత్మీయత , అభిమానాల గొడవలు
కమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసన
దూరమవుతున్న బందాల అన్వేషన
దగ్గరగా ఉన్న , పరిచయాలే పక్కన