Wednesday, 28 May 2014

కవిత నెం 30:ఆలు మగలు

కవిత నెం :30 *ఆలు మగలు * బార్యా భర్తల బందం ఎంతో పవిత్రమైనది మూడు ముళ్ళ బంధమది ఏడడుగుల అనుబంధమది జన్మ జన్మల బాందవ్యమది నీకోసం ఒక తోడు నిరంతరం నీతో పాటుగా జీవించటానికి ఏర్పరిచినబంధం  ''పెళ్లి'' బందువులు ,స్నేహితులు ,ఆత్మీయులు అని ఎందరున్నా నీవంటే ప్రత్యేకంగా , నీ కోసమే తన సావాసం అన్నట్టుగా నీ కోసమే ఈ జీవితం అంకితంగా నిర్ణయింపబడినదే ఈ బార్య భర్తల బంధం ఒకరంటే ఒకరు ,ఒకరి కోసం ఒకరు జీవితాంతం వారికి వారే తోడూ నీడా కష్ట సుఖాలు ,కలిమి లేములు లను సమపాలుగా...

Tuesday, 6 May 2014

కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం)

కవిత నెం :29 ***నీ ఓటే ఒక ఆయుధం*** చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి నీ ఓటే ఒక ఆయుధం  //2// నీ గుండెచప్పుడు గెలవటానికి నీ మనసు స్వచ్చత ను నిలపటానికి నీ ఓటే ఒక ఆయుధం //2// రాజ్యాంగాన్ని తిరగరాసే సిరా ఏరా ఈ ఓటు ఆయుధం రాజకీయవ్యవస్థను ప్రక్షాళన చేసే ఈ ఓటు ఆయుధం నీ గళం సుస్థిరం కావాలంటే ఏమ నవచైతన్య పునాదులు లేవాలంటే నీ ఓటే ఒక ఆయుధం //2// అంధకార చీకట్లు తోలగాలంటే అదికార దాహాలను దించాలంటే నీ ఓటే ఒక ఆయుధం //2//  అవినీతిని బహిష్కరించటానికి నిజాయితీ నీడ మిగలటానికి నీ ఓటే ఒక ఆయుధం //2// ప్రజల విలువ...

Friday, 2 May 2014

కవిత నెం 28:ఈ వేళ

కవిత నెం :28 నా కనుల ముందు నీ తోడు లేక  దాచి ఉంచా అది నీకు చెప్పలేక నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ  నీ కోసం రాహదారిలో బాటసారిగా పయనించుచున్న వేళ  నింగినంతా కళ్ళు చేసుకుని ఎడబాటుతో ఎదురుచూస్తున్న వేళ  ఎదలో తెలియని ఆశతో నిరంతర నిశబ్దంతో నిలిచున్న వేళ  నా మౌనం మది అంతరంగమై అదృశ్యమించే వేళ   చిరుగాలి సైతం చిన్నబోయి చతికిలపడిన వేళ  నీ జ్ఞాపకాలతో బ్రతుకుచున్నా చెలీ ఈ వేళ  నీ తలపుల ఊసులతో ఊపిరిని పోసుకుంటూ గడిపేస్తున్నా...